Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణవైద్యం

District collector : రక్త నమూనాల రిపోర్టులు సకాలంలో అందించాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

District collector : రక్త నమూనాల రిపోర్టులు సకాలంలో అందించాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

కొల్చారం, మన సాక్షి :

ప్రజల ఆరోగ్య సంరక్షణే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు.శనివారం కొల్చారం మండలం రంగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలోని ఓపీ వార్డు, ఐపీ వార్డు, ఏఎన్సీ క్లినిక్ ను, సందర్శించి, ఆరోగ్య కేంద్రంలో రోగులకు అందిస్తున్న వైద్య సదుపాయాలు, రోగుల వివరాల గురించి, వైద్యులు, నర్సులు, సిబ్బంది హాజరును అడిగి తెలుసుకున్నారు.

అలాగే రోగులతో మాట్లాడి వారి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఆరోగ్య కేంద్రంలో ఎప్పుడు చేరారు, ఏం అయ్యింది, ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది, కేంద్రంలో అందించే భోజనం ఎలా ఉంది, మందులు సమయానుగుణంగా వేస్తున్నారా, టెస్టులకు వచ్చి ఎంతసేపు అవుతుందని అడిగారు. ఆరోగ్యం చాలా విలువైందని, ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలని రోగులకు సూచించారు.

ఆరోగ్య కేంద్రం పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతిరోజూ ఫాగింగ్ చేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.అదే విధంగా వైద్యులు, నర్సులు, సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ లను, ఓపీ, ఐపీ రిజిస్టర్లను, మందుల నిల్వల రిజిస్టర్ లను పరిశీలించి, రక్త నమూనాలను అధిక సంఖ్యలో సేకరించి, వాటి రిపోర్ట్ లను సకాలంలో అందించాలని, ఓపీ సేవలను మరింతగా పెంచేందుకు కృషి చేయాలన్నారు.

యాంటీబయోటిక్స్, పాము కాటు మందులు, తదితర ఔషధ నిల్వలను సరిపడా అందుబాటులో ఉంచాలని, రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు, నర్సులకు సూచించారు. ఈ తనిఖీలో సంబంధిత అధికారులు, వైద్యులు, నర్సులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. UPI : ఫోన్ పే, గూగుల్ పే కొత్త రూల్స్.. ఇలా చేయకుంటే మీ లావాదేవీలు ఆగిపోతాయి..!

  2. TG News : తెలంగాణలో మహిళలకు కుటుంబ భరోసా కు రూ.10 లక్షలు.. మంత్రి సీతక్క కీలక ప్రకటన..!

  3. District collector : ఇందిరమ్మ ఇండ్లు మొదటి ప్రాధాన్యత వారికే.. జిల్లా కలెక్టర్ స్పష్టం..!

  4. Ration Cards : రేషన్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్..!

మరిన్ని వార్తలు