T20 world Cup 2024 : టి20 వరల్డ్ కప్ లో డబ్బే.. డబ్బు.. ప్రైజ్ మనీ ఎంతో తెలిస్తే షాక్..!
T20 world Cup 2024 : టి20 వరల్డ్ కప్ లో డబ్బే.. డబ్బు.. ప్రైజ్ మనీ ఎంతో తెలిస్తే షాక్..!
మన సాక్షి, స్పోర్ట్స్:
T20 World Cup: టి20 వరల్డ్ కప్ – 2024 లో భారత్ విజేతగా నిలిచింది. ఈ వరల్డ్ కప్ T20 చరిత్రలోనే అత్యధిక ప్రైజ్ మనీ అందించిందిగా చెప్పవచ్చును. 2024 టి20 వరల్డ్ కప్ లో మొత్తం ప్రైస్ ఫుల్ 11. 24 మిలియన్ డాలర్స్. అంటే భారత కరెన్సీలో 93.51 కోట్ల రూపాయలు. ఇప్పటివరకు జరిగిన టి20 వరల్డ్ కప్ చరిత్రలోనే ఇది అత్యధికం.
ఫైనల్ లో గెలిచి కప్ అందుకున్న భారత్ ఈసారి భారీ మొత్తం ప్రైజ్ మనీ దక్కించుకుంది. గెలిచిన టీమ్ ఇండియా 20.3 కోట్ల రూపాయలు అందుకుంది. రన్నర్ గా నిలిచిన సౌత్ ఆఫ్రికా జట్టుకు 10. 64 కోట్ల రూపాయలు అందుతాయి. అదేవిధంగా సెమీ ఫైనల్లో ఓటమిపాలైన ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్, జట్లకు 6.5 కోట్లు దక్కుతాయి. సూపర్ 8 దశలతోటే సరిపెట్టుకున్న బంగ్లాదేశ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, అమెరికా జట్లకు 3.18 కోట్ల రూపాయలు అందుతాయి.
గ్రూపులో మూడో స్థానంలో నిలిచిన జట్లకు 2.06 కోట్లు, మిగిలిన జట్లకు 1.87 కోట్లు అందనున్నాయి. 9 – 12 స్థానంలో ఉన్న జట్లకు రెండు కోట్లు, 13 – 20 స్థానంలో ఉన్న జట్లకు 1.8 కోట్లు లభిస్తాయి. గ్రూప్ లో విజయం సాధించిన జట్లకు బోనస్ గా 25.9 లక్షలు లభిస్తాయి. గత వరల్డ్ కప్ లో విజేతకు ₹12 కోట్ల ప్రైస్ మనీ దక్కగా ఈసారి విజేత భారత్ కు ₹20.3 కోట్లు దక్కాయి.
ALSO READ :
T20 World Cup 2024 : టి20 వరల్డ్ కప్ లో.. విశ్వవిజేతగా భారత్..!
Runamafi : రుణమాఫీ పై సీఎం రేవంత్ రెడ్డి మరో ప్రకటన.. కీలక అప్ డేట్..!










