District collector : బాక్స్ టు బాక్స్.. క్షుణ్ణంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్..!

District collector : బాక్స్ టు బాక్స్.. క్షుణ్ణంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్..!
కేతేపల్లి, మనసాక్షి :
కేతేపల్లి మండల కేంద్రంలోని డి పాల్ పాఠశాల లో ఏర్పాటుచేసిన గ్రామ పంచాయతీ ఎన్నికల సామాగ్రి పంపిణీ,స్వీకరణ కేంద్రాన్ని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్నికల సామాగ్రి, పోస్టల్ బ్యాలెట్ సామాగ్రిని, పోలింగ్ బాక్సులను పరిశీలించి అనంతరం డిఆర్సి కేంద్రాల ఇన్చార్జిలను వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ అత్యంత బాధ్యతతో నిర్వర్తించాల్సిన ప్రక్రియ అని, పోలింగ్ సిబ్బందికి కావాల్సిన సామాగ్రిని సరైన సమయానికి, సరైన ప్రోటోకాల్ ప్రకారం అందించాలని, ప్రతి కిట్ ను చెక్ లిస్ట్ తో సరిపోల్చి చూసుకొని పంపిణీ చేయాలన్నారు.
పోలింగ్ ముగిసిన తర్వాత రిసెప్షన్ సమయంలో సైతం ఇదే విధంగా అన్ని క్షున్నంగా పరిశీలించి తీసుకోవాలని, రికార్డింగ్, ధ్రువీకరణ పనులు కచ్చితంగా జరిగేలా చూడాలన్నారు. అలాగే పోలింగ్ సెంటర్లలో ఏర్పాటు చేసిన సౌకర్యాలు, భద్రతా ప్రమాణాలు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, త్రాగునీరు, ర్యాంపులు, వీల్ చైర్లు, లైటింగ్ తదితర ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. అధికారులందరూ జాగ్రత్తగా, సమన్వయంతో పనిచేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో శ్రీనివాసరావు, జిల్లా పంచాయతీ అధికారి వెంకటయ్య,నల్గొండ ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి , జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి , కేతపల్లి తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీవో బి .శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.
MOST READ
-
TG News : తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు.. రెండో విడుతలో ఏకగ్రీవాల జోరు, అన్ని వందలా..!
-
TG News : తెలంగాణ రైజింగ్, గ్లోబల్ సమ్మిట్ రేపటి నుంచే.. ఏంచేస్తారో తెలుసా..!
-
TG News : తెలంగాణ రైజింగ్, గ్లోబల్ సమ్మిట్ రేపటి నుంచే.. ఏంచేస్తారో తెలుసా..!
-
TG News : తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్లపై కీలక ప్రకటన..!
-
TG News : రైతులకు తీపి కబురు.. ఖాతాలలో రూ.7887 కోట్లు, రాకుంటే ఇలా చేయండి..!









