TOP STORIESBreaking Newsతెలంగాణనిజామాబాద్

Nimbachalam : నింబాచలానికి బ్రహ్మోత్సవ శోభ.. భక్తుల కొంగు బంగారం లక్ష్మీనారసింహుడు..!

Nimbachalam : నింబాచలానికి బ్రహ్మోత్సవ శోభ.. భక్తుల కొంగు బంగారం లక్ష్మీనారసింహుడు..!

భీంగల్, మన సాక్షి:

గౌతమీ (గోదావరి) నదికి దక్షిణ దిశగా రెండు యోజనాల దూరంలో ఉన్న శ్రీ లక్ష్మీనారసింహుడి దివ్యక్షేత్రం నింబాచలంగా విలసిల్లుతున్నది. దట్టమైన వేప చెట్లతో నిండి ఉండడంతో ఈ గుట్టకు నింబాచలంగా పేరు వచ్చినట్లు చరిత్ర. భీంగల్ మండల పరిధిలోని ఈ పుణ్యక్షేత్రం కాలక్రమేణా లింబాద్రిగుట్టగా ప్రసిద్ధి చెందింది.

భక్తుల కొంగుబంగారంగా అలరారుతున్న స్వామివారి బ్రహోత్సవాలు నేటి సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఏటా కార్తీక మాసంలో నిర్వహించే ఈ వేడుకల కోసం ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామి వారి నిత్య కైంకర్యాలతోపాటు బ్రహ్మోత్సవాలను నంబి వంశస్థులు నిర్వహించడం ఆనవాయితీ. ఆలయ ధర్మకర్తగా నంబి లింబాద్రి వ్యవహరిస్తున్నారు.

తొలి పూజాగా పెద్దంగంటి ఎల్లమ్మ కు సౌభాగ్య సారె సమర్పణ:

భీంగల్ మండలం లింబాద్రి బ్రహ్మోత్సవ కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటిగా క్షేత్ర పురాణం లో శ్రీ స్వామి వారి ఆజ్ఞ ప్రకారం భీంగల్ గ్రామదేవత అయిన శ్రీ పెద్దంగంటి ఎల్లమ్మ తల్లి కి శ్రీ వారి ఆలయం తరపున సౌభాగ్య సారె సమర్పణ. శ్రీ నింబాద్రి లక్ష్మీ నృసింహస్వామి వారి నిత్య బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. దక్షిణ బద్రిగా పిలవబడే శ్రీ నింబాచల లక్ష్మీ నరసింహ క్షేత్రానికి క్షేత్ర పాలకురాలుగా ఉన్నటువంటి శ్రీ పెద్ద వేముగంటి (బడా భీంగల్) ఎల్లమ్మ తల్లికి నింబాచాల క్షేత్రం వారు తొలి పూజను ఆదివారం నిర్వహించడం జరిగింది.

మహిమ కలిగిన పెద్దంగంటి ఎల్లమ్మ క్షేత్రం.

లక్ష్మీనరసింహస్వామి దేవుడు గుట్ట ఎక్కే ముందు, జాతర బ్రహ్మోత్సవాలు నిర్వహించే ముందు తొలి పూజగా పెదంగంటి (బడా భీంగల్)ఎల్లమ్మ తల్లి కి శ్రీ నింబాచాల లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం వారు నిర్వహించడం అనాదిగా, అనావాయితిగా వస్తుంది, అంతేకాకుండా, లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న వాళ్ళందరూ బడా భీంగల్ గ్రామంలో కొలువై ఉన్న పెదంగంటి ఎల్లమ్మ తల్లిని దర్శించుకోవాలని అనాదిగా, అనవహితిగా వస్తుంది.

ఈరోజు బడా భీంగల్ గ్రామ ప్రజలు వారిని సాధర డప్పులతో, మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. శ్రీ నింబాచల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు, జాతర ఘనంగా జరిగెలా చూడాలని మా గ్రామ ప్రజలంతా అమ్మవారిని వేడుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీడిసి సభ్యులు, గ్రామ మహిళలు, ప్రజలు పాల్గొనడం జరిగింది.

స్వామి వారి బ్రహ్మోత్సవాలు:

స్వామి వారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 27 వ తేది నుండి నవంబర్ 07 వరకు జరుగుతాయి. అక్టోబర్ 27 అనగా సోమవారం స్వామి వారు కోండపైకి చేరుకుంటారు. దీంతో బ్రహ్మో త్సవాలు ప్రారంభం అవుతాయి.

MOST READ : 

  1. Wrong Route : రాంగ్ రూట్ లో వెళ్తున్న బైక్ ఆపిన పోలీసులు.. చలాన్లు చూసి కంగుతిన్నారు..!

  2. Hello Srinivas : హలో శ్రీనివాస్.. విశిష్టమైన ఐక్యత.. 26న శ్రీనివాస్ పేరు గల వ్యక్తుల ఆత్మీయ సమ్మేళనం..!

  3. Model Village : మోడల్ సోలార్ గ్రామంగా మరికల్..!

  4. Nalgonda : పిన్ని కూతురిని గర్భవతిని చేసిన అన్న.. 21 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష..!

మరిన్ని వార్తలు