Breaking NewsTOP STORIESతెలంగాణ

Ration Cards : కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు బ్రేక్..!

Ration Cards : కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు బ్రేక్..!

హైదరాబాద్ , మన సాక్షి :

తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వ నిర్ణయానికి బ్రేక్ పడింది. గత పది సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డు లేక పేదలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తామని ప్రకటించింది. ప్రజా పాలన దరఖాస్తులలో కొత్త రేషన్ కార్డులకు కూడా దరఖాస్తులు స్వీకరించింది.

కానీ తిరిగి కొత్త రేషన్ కార్డులకు మళ్ళీ దరఖాస్తులు చేసుకోవాలని సర్కారు ప్రకటించింది. అక్టోబర్ 2వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులకు అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ 2వ తేదీన దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించలేదు. అంటే కొత్త రేషన్ కార్డులకు బ్రేక్ పడినట్లే అని చెప్పవచ్చును.

డిజిటల్ కార్డుల కోసం అధికారుల హడావుడి :

తెలంగాణ కుటుంబానికి డిజిటల్ కార్డులు అందజేయాలని ఆలోచనలో ఉన్నందున రేషన్ కార్డుల ప్రక్రియ నిలిపివేసినట్లు సమాచారం. రేషన్ తో పాటు అన్ని సంక్షేమ పథకాలకు కూడా డిజిటల్ కార్డు ని ప్రామాణికంగా ప్రభుత్వం తీసుకోనున్నది.

అందుకుగాను రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో మునిసిపాలిటీలలో, గ్రామాలలో పైలట్ ప్రాజెక్టును గురువారం ప్రారంభించారు. బుధవారం పైలట్ ప్రాజెక్టులో పాల్గొనే అధికారులు అందరికీ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కేవలం ఐదు రోజుల్లోనే పైలట్ ప్రాజెక్టు సర్వేను పూర్తి చేసి ఈనెల 10వ తేదీన ప్రాజెక్టు నివేదికను ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంది.

ఫ్యామిలీ గుర్తింపు కార్డును ఇచ్చే విధంగా.. కుటుంబ పెద్దగా మహిళను పేర్కొంటూ కార్డులో కుటుంబ సభ్యులందరి పేర్లు ఉండేవిధంగా కేటాయిస్తారు. ఒక్కొక్కరికి ఒక్క నెంబర్ కేటాయిస్తారు. ఇప్పటికే పలు రాష్ట్రాలలో డిజిటల్ ఫ్యామిలీ కార్డులు ఉన్నాయి. వాటిని తెలంగాణ ప్రభుత్వం పరిశీలించింది.

తెలంగాణలో కూడా అన్నింటికీ ఓకే డిజిటల్ కార్డును ఉపయోగించేలా మంజూరు చేయాలని భావించింది. అందుకుగాను పైలట్ ప్రాజెక్టు కింద గ్రామాలను మున్సిపాలిటీలను ఎంపిక చేసి సర్వేను ప్రారంభించారు. ఈ క్రమంలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుల ప్రక్రియ ఆగిపోయినట్లే అని చెప్పవచ్చును.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు