Breaking News : మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. లేటెస్ట్ అప్డేట్..!
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల అప్డేట్ మన సాక్షి ఎప్పటికప్పుడు మీ ముందు అందిస్తోంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఎన్నికలు నిర్వహించగా లెక్కింపు ప్రారంభమైంది. కొన్ని ఫలితాలు కూడా వెలువడ్డాయి.

Breaking News : మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. లేటెస్ట్ అప్డేట్..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల అప్డేట్ మన సాక్షి ఎప్పటికప్పుడు మీ ముందు అందిస్తోంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఎన్నికలు నిర్వహించగా లెక్కింపు ప్రారంభమైంది. కొన్ని ఫలితాలు కూడా వెలువడ్డాయి.
మొత్తం 2581 మున్సిపల్ వార్డులకు గాను ఇప్పటివరకు వెలువడిగా ఫలితాల ఆధారంగా కాంగ్రెస్ పార్టీ 398 వార్డుల్లో విజయం సాధించగా టిఆర్ఎస్ 209 వార్డుల్లో, బిజెపి 60 వార్డుల్లో, ఇతరులు 58 వార్డులో విజయం సాధించారు. అదేవిధంగా ఏడు మున్సిపల్ కార్పొరేషన్లలో 414 డివిజన్లకు గాను కాంగ్రెస్ రెండు డివిజన్లో విజయం సాధించింది.
వెలువడిన ఫలితాలు ఇలా..
ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.
నందికొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.
హాలియా మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.
చిట్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయం సాధించింది.
చండూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ గెలిచింది.
సంగారెడ్డి జిల్లా గడ్డి పోతారం మున్సిపాలిటీ బి ఆర్ ఎస్ కైవసం చేసుకుంది.
ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ టిఆర్ఎస్ గెలుచుకుంది
ములుగు మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది.
భద్రాద్రి జిల్లా ఇల్లందు మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ, డోర్నకల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ గెలుచుకుంది.
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర కాంగ్రెస్ విజయం సాధించింది.
భద్రాద్రి జిల్లా అశ్వరావుపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది
సంగారెడ్డి జిల్లా కోహిర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ గెలిచింది.
మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీ బిఆర్ఎస్ కైవసం చేసుకుంది
మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ విజయం సాధించింది