Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsప్రపంచం

WhatsApp : వాట్సాప్ పై నిషేధం..?

ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్, మెసేజింగ్ యాప్ లను ప్రజలు ఎన్నో వినియోగిస్తున్నారు. వాట్సప్, టెలిగ్రామ్ వంటి యాప్ లు కోట్లాది మంది వినియోగిస్తున్నారు.

WhatsApp : వాట్సాప్ పై నిషేధం..?

మన సాక్షి, వెబ్ డెస్క్ :

ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్, మెసేజింగ్ యాప్ లను ప్రజలు ఎన్నో వినియోగిస్తున్నారు. వాట్సప్, టెలిగ్రామ్ వంటి యాప్ లు కోట్లాది మంది వినియోగిస్తున్నారు. అయితే రష్యా ప్రభుత్వం తమ సేవలను దేశంలో పూర్తిగా బ్లాక్ చేయడానికి ప్రయత్నించిందని వాట్సప్ వెల్లడించింది. అందుకు కారణం ప్రభుత్వం నిర్వహించే మ్యాక్స్ సూపర్ యాప్ ను ముందుకు తీసుకురావడమే అని పేర్కొన్నది.

రష్యా దేశానికి చెందిన మ్యాక్స్ అనే ఆప్ ఆ ప్రభుత్వం వీచాట్ నమూనాను అనుసరించి రూపొందించింది. ఇది మెసేజింగ్, కాల్స్ చేయడానికి మాత్రమే కాకుండా.. ప్రభుత్వ సేవలు, డాక్యుమెంట్, స్టోరేజ్ వంటి వాటి కూడా ఉపయోగించబడుతుంది. దాంతో పాటు మనీ ట్రాన్సాక్షన్ చేయడానికి కూడా అనుమతించింది.

దాంతో పాటు దేశంలో అమ్ముడు అవుతున్న స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లలో కూడా ఈ మ్యాక్స్ యాప్ ను ముందుగానే ఇన్ స్టాల్ చేయాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. వాట్సాప్ ను పూర్తిగా బ్లాక్ చేయడానికి ప్రయత్నించింది. అయితే ప్రభుత్వ యాజమాన్యంలోని యాప్ కి నడిపించే ప్రయత్నం చేసింది. వినియోగదారులను కనెక్ట్ చేయడానికి మేము చేయగలిగినంత చేస్తూనే ఉన్నాము.. అంటూ వాట్సప్ ట్విట్టర్ లో పేర్కొన్నది.

విదేశీ యాప్ లపై కఠిన చర్యలు తీసుకునే భాగంలో రష్యా ప్రభుత్వం వాట్సాప్, టెలికాం సేవలను పరిమితం చేసింది. టెలిగ్రామ్ కంపెనీ ప్రభుత్వ ఆదేశాలను పాటించడం లేదని క్రిమినల్, ఉగ్రవాద కంటెంట్ తొలగించ లేదని ఆరోపణలు రావడంతో ఆ ప్రభుత్వం కమ్యూనికేషన్ నియంత్రణ సంస్థ టెలిగ్రామ్ పై పరిమితులను విధించేందుకు చర్యలు చేపట్టింది. దాంతో పాటు టెలిగ్రామ్ పై 64 మిలియన్ రూబిళ్ళ జరిమానా విధించే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది.

అయితే రష్యా ప్రభుత్వం నిర్వహించే మ్యాక్స్ యాప్ పై కూడా విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ యాప్ ద్వారా వినియోగదారులు సమాచారం ప్రభుత్వం చేతిలోకి వెళ్లే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మెటా మొండి వైఖరిగా ప్రవర్తిస్తే మాత్రం వాట్సప్ పూర్తిగా కనుమరుగ అయ్యే అవకాశం ఉందని, చర్చలకు సిద్ధంగా ఉంటే ఒప్పందం సాధ్యమవుతుందని పలువురు పేర్కొంటున్నారు. చర్చలు సఫలమైతే వాట్సప్ రష్యాలో తిరిగి తమ సేవలను యధావిధిగా అందించే విధంగా ఉంటుంది.

 

ఇవి కూడా చదవండి : 

  1. Doctorate : బ్రెయిన్ ట్యూమర్ గుర్తింపుపై పరిశోధన.. పుగళరసికి డాక్టరేట్..!

  2. పాతాళ త్రికోణ మహా సుందరి ఆలయంలో హీరో రాజేంద్రప్రసాద్ ప్రత్యేక పూజలు..!

  3. ACB : రూ.50 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కిన యువ ఎస్సై..!

  4. CM Revanth Reddy : జాతిపితవా నువ్వు..?

మరిన్ని వార్తలు