Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండ

District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఇలా..! 

ఏలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపును పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి. చంద్రశేఖర్ అన్నారు.

District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఇలా..! 

నల్లగొండ, మన సాక్షి

ఏలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపును పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి. చంద్రశేఖర్ అన్నారు. గురువారం సాయంత్రం అయన ఆర్జాలబావి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాంలో ఏర్పాటు చేసిన నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని మున్సిపల్ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకులు జి. రమేష్ తో కలిసి కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు.

అనంతరం ఆర్ ఓ,ఏ ఆర్ ఓ, కౌంటింగ్ సూపర్వైజర్లతో సమావేశం నిర్వహించారు.
కౌంటింగ్ రోజున సిబ్బంది అందరూ ఉదయం 6 గంటలకు కౌంటింగ్ కేంద్రంలో రిపోర్ట్ చేయాలని, కౌంటింగ్ కేంద్రంలోకి ఆర్వో ,హాల్ ఇంచార్జ్ తప్ప ఎవరి మొబైల్ ఫోన్ అనుమతి ఉండదని తెలిపారు. కౌంటింగ్ సిబ్బంది బ్యాలెట్ బాక్స్ సీరియల్ నెంబర్ సరిగా ఉన్నది లేనిది పరిశీలించాలని, అలాగే స్టాచుటరి మెటీరియల్, పీజియన్ బాక్స్ ,ఓట్ల లెక్కింపు తర్వాత బండిల్స్ వేసేందుకు డ్రమ్ములు వంటి అన్ని ఏర్పాట్లు చూసుకోవాలని తెలిపారు.

13న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపట్టడం జరుగుతుందని ,అనంతరం రెగ్యులర్ ఓట్లలెక్కింపు ఉంటుందని ,కౌంటింగ్ టేబుల్ వద్ద సిబ్బంది అందరూ అలాగే ఆర్ ఓ. లతో సహా నిశ్శబ్దాన్ని పాటించాల్సిన అవసరం ఉందని, 25 బండిళ్ల చొప్పున కట్టలు కట్టిన తర్వాత ఓట్ల లెక్కింపు చేపడతారన్నారు.

ఓట్ల లెక్కింపును పూర్తిగా ఎలాంటి తప్పులకు ఆస్కారం ఇవ్వకుండా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలని, ముఖ్యంగా చెల్లిన, చెల్లని ఓట్ల విషయంలో ఒకటికి రెండుసార్లు చూసుకొని బాక్స్ లో వేయాలని, రాష్ట్ర ఎన్నికల సంఘం జారీచేసిన సర్కులర్లు అన్నింటిని మరొకసారి చదువుకోవాలని, మొత్తం ఓట్ల లెక్కింపు చేసేటప్పుడు ఎలాంటి తప్పులు జరగకుండా చూడాలని, రీకౌంటింగ్ కు ఆస్కారం లేకుండా ఓట్ల లెక్కింపు నిర్వహించాలని ఆయన ఆదేశించారు.

సాధారణ పరిశీలకులు జీ. రమేష్ ,రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ అశోక్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడి రాజ్ కుమార్, డిసిఓ పత్యా నాయక్,జెడ్ పి సి ఈ ఓ శ్రీనివాసరావు, తదితరులు ఉన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుల ఆధ్వర్యంలో సిబ్బంది రాండమెంజేషన్ ను నిర్వహించారు.

MOST READ

  1. Narayanpet : మున్సిపల్ కౌంటింగ్ వేళ జిల్లా ఎస్పీ కీలక ఆదేశం.. వారికి అనుమతి లేదు..!

  2. Bandi Sanjay : లాఠీచార్జ్ లో  గాయపడిన వారిని పరామర్శించిన కేంద్రం మంత్రి బండి సంజయ్..!

  3. District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రాల పరిశీలన..!

  4. Miryalaguda : మిర్యాలగూడలో బీఆర్ఎస్ కార్యకర్తపై దాడి.. పరామర్శించిన నేతలు..!

మరిన్ని వార్తలు