Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రాల పరిశీలన..!

మున్సిపల్ ఎన్నికలలో భాగంగా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ తోపాటు, జిల్లాలోని 6 మున్సిపల్టీలలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి. చంద్రశేఖర్ తెలిపారు.

District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రాల పరిశీలన..!

నల్లగొండ, మన సాక్షి.

మున్సిపల్ ఎన్నికలలో భాగంగా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ తోపాటు, జిల్లాలోని 6 మున్సిపల్టీలలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి. చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైన వెంటనే ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ గార్డెన్ సమీపంలో ఉన్న ఉర్దూ మీడియం పాఠశాల లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడ ఓటర్లకు చేసిన ఏర్పాట్లు, పోలింగ్ సరళిని పరిశీలించారు.

అన్ని గదుల నుండి వెబ్ క్యాస్టింగ్ ఉండేలా చూడాలని, అన్ని పోలింగ్ కేంద్రాలలో ప్రథమ అందించేందుకు మెడికల్ టీంలు గేట్ సమీపంలో ఏర్పాటు చేయాలని, దివ్యాంగ ఓటర్లు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రం సమీపంలో వీల్ చైర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని, పోలింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్ అనుమతించకూడదని, ఓటర్లు ఎన్నికల సంఘం అనుమతించిన 18 గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి చూపించిన వెంటనే లోపలికి అనుమతించాలని కలెక్టర్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

అనంతరం బోయవాడ పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఓటర్లతో మాట్లాడారు. సౌకర్యాలు, ఇబ్బందులపై ఆరా తీశారు.అనంతరం మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉదయం 7గంటల నుండి జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూలైన్లలో నిలుచున్నారని, పోలింగ్ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు.

ఓటింగ్ శాతం పెరిగేందుకు అవగాహన కల్పించడం వల్ల ఈ విడత ఓటింగ్ పర్సంటేజ్ పెరిగేందుకు అవకాశం ఉందన్నారు .ఓటర్లకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నామని ,మహిళ ,పురుష ఓటర్లకు వేరువేరుగా క్యూలైన్ల ఏర్పాటు , తాగునీరు, టెంట్, కుర్చీలు, దివ్యాంగ ఓటర్లకు వీల్ చైర్లు, హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశామని , ప్రత్యేకించి వార్డ్ ఆఫీసర్లను కూడా నియమించామని, ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారని, ఏవైనా సమస్యలు వస్తే పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలో ఏర్పాటు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని సమస్యలపై కంట్రోల్ రూమ్ లోని ఫోన్ నెంబర్ 18004251442 కు ఫోన్ చేసి తెలియజేయాలని ఆయన కోరారు.

అన్ని పోలింగ్ కేంద్రాలలో 100% వెబ్ క్యాస్టింగ్ చేస్తున్నామని, పోలింగ్ సిబ్బంది సంక్షేమం కోసం అన్ని చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ ద్వారా జిల్లా వ్యాప్తంగా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్, మిర్యాలగూడ , దేవరకొండ, నందికొండ ,హలియా, చిట్యాల, చండూరు మున్సిపాలిటీలకు సంబంధించి వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించారు.

మున్సిపల్ ఎన్నికల జిల్లా సాదిరణ పరిశీలకులు జి. రమేష్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర, స్థానిక తహసిల్దార్ పరశురాం, తదితరులు ఉన్నారు.
కాగా ఉదయం 9 గంటలకు జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు కలుపుకొని 11.2 శాతం ఓట్లు పోలయ్యాయి.

By : Shekar, Nalgonda 

ఇవి కూడా చదవండి : 

  1. Municipal Elections : రెండు గంటల్లో నల్గొండ జిల్లాలో 17% పోలింగ్.. మిర్యాలగూడలో పదివేల ఓట్లు పోల్..!

  2. Nalgonda : నల్గొండ జిల్లాలో ఎస్పీ విస్తృత తనిఖీలు.. వెండి, మద్యం, చీరల పట్టివేత..!

  3. MUNICIPAL ELECTIONS : తెలంగాణలో మున్సిపల్ పోలింగ్ ప్రారంభం.. పట్టణాల్లో హై అలర్ట్..!

  4. TG News : తెలంగాణలో సర్పంచులకు మరో కీలక అధికారాలు..!

మరిన్ని వార్తలు