Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణ

TG News : తెలంగాణలో సర్పంచులకు మరో కీలక అధికారాలు..!

తెలంగాణలో గ్రామపంచాయతీ సర్పంచులకు ప్రభుత్వం మరో కీలక అధికారులను అప్పగించింది. గ్రామాలలో అంగన్వాడి కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలను పూర్తిగా సర్పంచులకే అప్పగించింది.

TG News : తెలంగాణలో సర్పంచులకు మరో కీలక అధికారాలు..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో గ్రామపంచాయతీ సర్పంచులకు ప్రభుత్వం మరో కీలక అధికారులను అప్పగించింది. గ్రామాలలో అంగన్వాడి కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలను పూర్తిగా సర్పంచులకే అప్పగించింది. ఈ విషయంపై ప్రభుత్వం లేటెస్ట్ గా ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్వాడి కేంద్రాలలో పౌష్టికాహారం పంపిణీలో అక్రమాలను అరికట్టడంతో పాటు అంగన్వాడీ కేంద్రాల బలోపేతం చేయడం కోసం సర్పంచులకు ఈ అధికారాలను అప్పగించింది.

రెండు సంవత్సరాల కాలం పాటు గ్రామాలలో పాలకమండలి లేకపోవడం వల్ల అంగన్వాడీ కేంద్రాలు ఇష్టానుసారంగా నిర్వహణ కొనసాగింది. దాంతో వాటిని గాడిలో పెట్టేందుకుగాను సర్పంచ్ లకు ఈ బాధ్యతలు అప్పగించారు. అంగన్వాడి కేంద్రాలలో మెనూ అందజేసే విషయంపై, అదే విధంగా కేంద్రానికి వచ్చిన వస్తువులు పక్కదారి పడుతున్న విషయంపై సర్పంచులు పర్యవేక్షణ చేయనున్నారు.

చైర్మన్ గా సర్పంచ్ :

అంగన్వాడి కేంద్రంలో పర్యవేక్షణకు గాను చైర్మన్ గా సర్పంచ్ వ్యవహరిస్తారు. మొత్తం 11 మంది సభ్యులు ఉంటారు. దీనిలో అంగన్వాడి టీచర్ కన్వీనర్ గా, ఏఎన్ఎం, స్కూల్ సైన్స్ టీచర్, ఒక రిటైర్డ్ ఉద్యోగి తోపాటు చిన్నారుల తల్లిదండ్రులు సభ్యులుగా ఉంటారు.

ఈ కమిటీ ప్రతినెల అంగన్వాడి కేంద్రాలకు అందుతున్న బియ్యం, పప్పు, బాలామృతం, గుడ్లు, పాలు ధర సరుకుల నాణ్యతను, పంపిణీని తనిఖీ చేస్తుంది. ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా గర్భిణీలు, బాలింతలకు అందుతున్న భోజనాన్ని కూడా పరిశీలిస్తారు. లక్షల రూపాయలు వెచ్చించి విలువైన పోషకాహారం లబ్ధిదారులకు సక్రమంగా అందించడమే ఈ కమిటీ యొక్క ప్రధాన ఉద్దేశం.

MOST READ 

  1. Nalgonda : సాగర్ ఎడమ కాలువలో కారు గల్లంతుకు ప్రధాన కారణం.. ఆ చిన్న పొరపాటే, అలా ఎవరు చేయొద్దు..!

  2. కంటతడి పెట్టిస్తున్న సుసైడ్ లెటర్.. తల్లిదండ్రులను కాదని ప్రేమ వివాహం.. పిల్లలకు ఉరివేసి తల్లి ఆత్మహత్య..!

  3. నల్గొండ జిల్లాలో మద్యం మత్తులో విద్యార్థిని పట్ల ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తన.. గ్రామస్తుల దేహశుద్ధి..!

  4. TG News : తెలంగాణలో దారుణం.. భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త..!

మరిన్ని వార్తలు