Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవిద్య

నల్గొండ జిల్లాలో మద్యం మత్తులో విద్యార్థిని పట్ల ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తన.. గ్రామస్తుల దేహశుద్ధి..!

మద్యం మత్తులో ఉపాధ్యాయుడు విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దాంతో ఆ గ్రామస్తులు ఆగ్రహంతో ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. 

నల్గొండ జిల్లాలో మద్యం మత్తులో విద్యార్థిని పట్ల ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తన.. గ్రామస్తుల దేహశుద్ధి..!

చింతపల్లి, మన సాక్షి :

మద్యం మత్తులో ఉపాధ్యాయుడు విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దాంతో ఆ గ్రామస్తులు ఆగ్రహంతో ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది.

నల్లగొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని గొడకొండ్ల ( వీటి నగర్) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ప్రతి నిత్యం మద్యం సేవించి వచ్చి ఐదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఆ ఉపాధ్యాయుడు ఇటీవల మండల పరిధిలోని తక్కల్లపల్లి ప్రాథమిక పాఠశాల నుండి డిప్యూటేషన్ పై వీటి నగర్ ప్రాథమిక పాఠశాలలో చేరి విధులు నిర్వహిస్తున్నాడు.

ఈ విషయాన్ని ఆ బాలిక తన తల్లిదండ్రులకు శుక్ర వారం తెలియపరిచింది. శనివారం ఉదయం విద్యార్థిని యొక్క తల్లిదండ్రులు కొందరు గ్రామ పెద్దలు ఆ పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుని ప్రవర్తనపై పాఠశాల ప్రధానోపాధ్యాయు నితో చర్చించారు. అక్కడే ఉన్న ఉపాధ్యాయుని పిలిచి ఏమిటి నీ ప్రవర్తన అని అడుగుతుండగా నేను సక్రమంగా నే వచ్చి చదువు చెబుతున్నానని బుకాయిస్తూ గ్రామ ప్రజలకు ఎదురు తిరిగాడు.

దీంతో కోపోద్రిక్తులైన విద్యార్థిని తల్లిదండ్రులు గ్రామ ప్రజలు అతనికి పాఠశాలలోనే దేహశుద్ధి చేశారు. పాఠశాలలో జరిగిన సంఘటన విషయాన్ని స్థానిక పోలీస్ స్టేషన్లో విద్యార్థినీ తల్లిదండ్రులు గ్రామ ప్రజలు ఫిర్యాదు చేశారు.

MOST READ 

  1. Suspension : మహిళ సర్పంచ్ అప్పుడే సస్పెన్షన్.. కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలి సస్పెన్షన్..!

  2. Municipal Elections : మున్సిపల్ ఎన్నికల కంట్రోల్ రూమ్ ఆకస్మిక తనిఖీ.. జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు కీలక ఆదేశాలు..!

  3. District Collector : భూభారతిపై నల్గొండ జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ప్రత్యక్షంగా పరిశీలన..!

  4. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ విజయారెడ్డి ఆత్మహత్య మిస్టరీ వీడిందా.. ఆ రెండు రోజులు ఏం జరిగింది..!

మరిన్ని వార్తలు