Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుBreaking Newsతెలంగాణరాజకీయం

Suspension : మహిళ సర్పంచ్ అప్పుడే సస్పెన్షన్.. కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలి సస్పెన్షన్..!

సర్పంచులు ఇటీవల బాధ్యతలు చేపట్టి రెండు నెలలు మాత్రమే అవుతుంది. ఇప్పటికే మహిళ సర్పంచ్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆమెను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Suspension : మహిళ సర్పంచ్ అప్పుడే సస్పెన్షన్.. కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలి సస్పెన్షన్..!

శంకర్‌పల్లి, మన సాక్షి,

సర్పంచులు ఇటీవల బాధ్యతలు చేపట్టి రెండు నెలలు మాత్రమే అవుతుంది. ఇప్పటికే మహిళ సర్పంచ్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆమెను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత సస్పెండ్ కు గురైన తొలి మహిళ సర్పంచి ఆమె అవుతుంది. వివరాల ప్రకారం..

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం మోకిలా తండ సర్పంచ్ శాంతమ్మ ను ఆరు నెలల పాటు సస్పెన్షన్ చేస్తూ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పేర్కొంటూ ఈ చర్యలు తీసుకున్నారు.

సర్పంచ్ శాంతమ్మ కుమారుడు బాబు నాయక్, ఆయన అనుచరులు ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంతో పాటు డిసెంబర్ 25వ తేదీన పంచాయతీ ఆవరణలోని ప్రహరీ గేటు, టాయిలెట్స్, చెట్లను నరకడం, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేసినట్లు పంచాయతీ అధికారి డిసెంబర్ 29వ తేదీన కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.

ఈ విషయంపై జిల్లా కలెక్టర్ ప్రభుత్వ పాలనలో కుటుంబ సభ్యుల జోక్యం, చెట్లను నరకడం నేరమని చెబుతూ జనవరి 12వ తేదీన సర్పంచ్‌ కి షోకాజ్ నోటీసు జారీ చేశారు. అయితే సర్పంచ్ జనవరి 19వ తేదీన సమాధానం ఇవ్వగా పరిశీలించిన కలెక్టర్ సంతృప్తికరంగా లేకపోవడంతో ఆమెను ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటి వరకు ఉపసర్పంచ్ సభావాత్ కవిత సర్పంచ్ విధులు నిర్వహిస్తారని స్పష్టం చేశారు.

MOST READ 

  1. TG News : తెలంగాణలో దారుణం.. భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త..!

  2. Municipal Elections : మున్సిపల్ ఎన్నికల కంట్రోల్ రూమ్ ఆకస్మిక తనిఖీ.. జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు కీలక ఆదేశాలు..!

  3. Miryalaguda : ఫర్టిలైజర్ యూరియా యాప్ పై మిర్యాలగూడలో రైతులతో జిల్లా కలెక్టర్ ముఖాముఖి..!

  4. Gold Price : మళ్లీ వేలల్లో పడిపోయిన పసిడి.. భారీగా దిగివచ్చిన ధర..!

మరిన్ని వార్తలు