Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణ

Gold Price : మళ్లీ వేలల్లో పడిపోయిన పసిడి.. భారీగా దిగివచ్చిన ధర..!

పసిడి ధర భారీగా పడి పోయింది. ఊహించని రీతిలో పెరిగిన బంగారం ధర అదే రీతిలో భారీగా తగ్గుముఖం పట్టింది.

Gold Price : మళ్లీ వేలల్లో పడిపోయిన పసిడి.. భారీగా దిగివచ్చిన ధర..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

పసిడి ధర భారీగా పడి పోయింది. ఊహించని రీతిలో పెరిగిన బంగారం ధర అదే రీతిలో భారీగా తగ్గుముఖం పట్టింది. తులం (10 గ్రాముల) బంగారం 1,80,000 చేరువైన బంగారం గత నాలుగు రోజులుగా భారీగా తగ్గుతూ వచ్చింది. దాంతో పసిడి ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సోమవారం ఒక్కరోజే 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు 90,500 రూపాయలు తగ్గింది. అదేవిధంగా 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం కు 83 వేల రూపాయలు తగ్గింది.

పడిపోయిన పసిడి ధర :

హైదరాబాద్ నగరం తో పాటు తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన పట్టణాల్లో సోమవారం 10 గ్రాముల (తులం) 24 క్యారెట్స్ బంగారం కు 9050 రూపాయలు తగ్గి 1,51,530 రూపాయలకు చేరింది. అదే విధంగా 22 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) బంగారం 8300 తగ్గి 1,38,900 రూపాయలకు చేరింది.

మరింత తగ్గనున్న బంగారం ధర :

ఫిబ్రవరి మాసంలో మరింత తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని వ్యాపారవేత్తలు పేర్కొంటున్నారు. మరో 20 నుంచి 30 వేల రూపాయల వరకు తులం బంగారం కు దగ్గర ఉన్నదని తెలుస్తోంది.

By : MNREDDY, Sr. Reporter,  Hyderabad 

Similar News 

  1. Miryalaguda : రాజకీయ దురుద్దేశంతోనే తెరపైకి ఫోన్ ట్యాపింగ్ కేసు..!

  2. Miryalaguda : చివరి నిమిషంలో షాక్.. మున్సిపల్ బరిలో ఎమ్మెల్యే బత్తుల కుటుంబ సభ్యులు..!

  3. Gold Price : ఊహించని రీతిలో మళ్లీ వేలల్లో పడిపోయిన బంగారం ధర.. ఈరోజు ఎంతంటే..!

  4. Tragedy : తీవ్ర విషాదం.. హైదరాబాద్ లో రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి..!

మరిన్ని వార్తలు