Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

Miryalaguda : రాజకీయ దురుద్దేశంతోనే తెరపైకి ఫోన్ ట్యాపింగ్ కేసు..!

తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కి సిట్ నోటీసుల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం సాగిస్తున్న రాజకీయ వేధింపులను నిరసిస్తూ... బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నల్లగొండ జిల్లాలో మిర్యాలగూడ పట్టణంలోని బస్టాండ్ వద్ద మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి.

Miryalaguda : రాజకీయ దురుద్దేశంతోనే తెరపైకి ఫోన్ ట్యాపింగ్ కేసు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కి సిట్ నోటీసుల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం సాగిస్తున్న రాజకీయ వేధింపులను నిరసిస్తూ… బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నల్లగొండ జిల్లాలో మిర్యాలగూడ పట్టణంలోని బస్టాండ్ వద్ద మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి.

అబద్ధాల పునాదులపై గద్దెనెక్కిన కాంగ్రెస్‌కు హామీలను అమలు చేయడం చేతకాక ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పై,ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని అన్నారు. ఆధారాలు లేని ఫోన్ ట్యాపింగ్ అనే లొట్టపీసు కేసులో రాజకీయ కక్షతోనే విచారణ పేరిట డ్రామాలు ఆడుతున్నదని ధ్వజమెత్తారు. రేవంత్ సర్కార్ రాజకీయ దురుద్దేశంతోనే ఫోన్ ట్యాపింగ్ కేసు ను తెరపైకి తెచ్చిందని విమర్శించారు.

ALSO READTragedy : తీవ్ర విషాదం.. హైదరాబాద్ లో రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి..!

బీఆర్ఎస్ ను రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుట్రలకు పాల్పడుతున్నాయని అన్నారు. కేసీఆర్ లక్ష్యంగా సిట్ అధికారుల తీరు కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందన్నారు. రేవంత్ సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ కేసు ను తెరపైకి తెచ్చి బీఆర్ఎస్ పై రేవంత్ సర్కార్ రాజకీయ కుట్ర పన్నిందన్నారు.

అంతకు ముందు బీఆర్ఎస్ శ్రేణులు మిర్యాలగూడ పట్టణంలో రెడ్డి కాలనీలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి నల్ల కండువాలు, ప్లకార్డులు చేబూని బస్టాండ్ వరకు భారీ ర్యాలీ తీశాయి. ఈ కార్యక్రమంలో టీఎస్ ఆగ్రోస్ మాజీ చైర్మన్ తిప్పన విజయసింహా రెడ్డి, రైతు బంధు సమితి మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్లమోతు సిద్దార్థ, ఏఏంసీ మాజీ చైర్మన్ చిట్టిబాబు నాయక్, పెద్ది శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి షోయబ్, పట్టణ బీఆర్ ఎస్ నాయకులు, కౌన్సిలర్ అభ్యర్థులు, మహిళా నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

By : Vinay Goud, Miryalaguda 

మరిన్ని వార్తలు