Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : సాగర్ ఎడమ కాలువలో కారు గల్లంతుకు ప్రధాన కారణం.. ఆ చిన్న పొరపాటే, అలా ఎవరు చేయొద్దు..!

నల్గొండ జిల్లాలో విషాదకరమైన సంఘటన చోటుచేసుకుని నాగార్జునసాగర్ ఎడమ కాలువలో కారు గల్లంతైన విషయం తెలిసిందే. శనివారం సాయంత్రం నల్గొండ జిల్లా త్రిపురారం మండలం కంపాసాగర్ కు చెందిన ఇరువురు దంపతులు సాగర్ ఎడమ కాలువలో గల్లంతయ్యారు.

Nalgonda : సాగర్ ఎడమ కాలువలో కారు గల్లంతుకు ప్రధాన కారణం.. ఆ చిన్న పొరపాటే, అలా ఎవరు చేయొద్దు..!

మన సాక్షి, నల్గొండ :

నల్గొండ జిల్లాలో విషాదకరమైన సంఘటన చోటుచేసుకుని నాగార్జునసాగర్ ఎడమ కాలువలో కారు గల్లంతైన విషయం తెలిసిందే. శనివారం సాయంత్రం నల్గొండ జిల్లా త్రిపురారం మండలం కంపాసాగర్ కు చెందిన ఇరువురు దంపతులు సాగర్ ఎడమ కాలువలో గల్లంతయ్యారు. ఈ ఘటనలో ప్రధాన కారణం ఏంటనే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

మిర్యాలగూడ నుంచి స్వగ్రామమైన కంపాసాగర్ కు కారులో వెళ్తుండగా నిడమనూరు మండలం ముకుందాపురం వద్ద సాగర్ ఎడమ కాలువలోో కి కారు దూసుకుపోయింది. ఈ ఘటనలో డ్రైవర్ ప్రాణాలతో బయటపడగా కంప సాగర్ గ్రామానికి చెందిన తల్లం పుల్లయ్య, పద్మ లు మృతి చెందారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టడంతో కారుతో పాటు పద్మ మృతదేహాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు.

ఈ సంఘటనకు ప్రధాన కారణం కారు డ్రైవింగ్ చేసే సమయంలో సర్వసాధారణంగా చాలామంది చేసే పని కాళ్లకు చెప్పులు విడిచి డ్రైవింగ్ చేస్తుంటారు. మరి కొంతమంది కారులోనే చెప్పులు ఉంచుకొని డ్రైవింగ్ సమయంలో వేసుకున్న చెప్పులను విడిచి డ్రైవింగ్ సమయంలో కారులో ఉన్న చెప్పులు వేసుకుంటారు. ఈ కారు డ్రైవర్ కూడా అదే పని చేశారు.

అతని కాళ్ళకు చెప్పులు ఉంచుకొని డ్రైవింగ్ చేస్తున్నారు. కానీ డ్రైవింగ్ సీటు వద్ద మరో జత చెప్పులు ఉన్నాయి. అయితే డ్రైవింగ్ సమయంలో ఆ చెప్పులు క్లచ్ బ్రేక్ వద్ద ఇరుక్కుపోయాయి. దాంతో డ్రైవర్ బ్రేక్ వేసిన ఆగకుండా కారు ఎడమ కాలువలోకి దూసుకు వెళ్ళింది. ఈ చిన్న పొరపాటు కారణంగా దంపతులు మృతి చెందారని చెప్పవచ్చును. ఇకపై ఇలాంటి పొరపాట్లు ఎవరు కూడా చేయవద్దని అధికారులు పేర్కొంటున్నారు.

MOST READ 

  1. Nalgonda : నల్గొండ జిల్లాలో సాగర్ ఎడమ కాలువలో గల్లంతైన కారు బయటకు.. మృతదేహాలు..!

  2. Narayanpet : రూ.1.57లక్షల విలువ గల వస్త్రాలు, 2.89 లక్షల నగదు పట్టివేత..!

  3. Municipal Elections : మున్సిపల్ బిగ్ ఫైట్.. మిర్యాలగూడలో కింగ్ మేకర్ ఎవరు..!

  4. Nalgonda : నల్గొండ జిల్లాలో సాగర్ ఎడమ కాలువలో గల్లంతైన కారు బయటకు.. మృతదేహాలు..!

మరిన్ని వార్తలు