Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Municipal Elections : మున్సిపల్ బిగ్ ఫైట్.. మిర్యాలగూడలో కింగ్ మేకర్ ఎవరు..!

మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీ లో రాజకీయ ఎత్తులు, పై ఎత్తులు సాగుతున్నాయి.

Municipal Elections : మున్సిపల్ బిగ్ ఫైట్.. మిర్యాలగూడలో కింగ్ మేకర్ ఎవరు..!

మన సాక్షి, మిర్యాలగూడ :

మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీ లో రాజకీయ ఎత్తులు, పై ఎత్తులు సాగుతున్నాయి.

అధికార కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగింది. చైర్మన్ స్థానం దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగుతున్నాయి. స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి తన అనుచరులకు చైర్మన్ స్థానం దక్కించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో స్థానిక శాసనసభ్యులు భత్తుల లక్ష్మారెడ్డి తో పాటు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ప్రచారం కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల తొలి ప్రచార బహిరంగ సభను కూడా మిర్యాలగూడ నుంచి ప్రారంభించారు.

ప్రతిపక్ష బీఆర్ఎస్ సిపిఎంతో జతకట్టింది. మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపించి చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే ప్రయత్నంలో ఆ పార్టీలు ఉన్నాయి. మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు, జూలకంటి రంగారెడ్డి కలిసి మిర్యాలగూడలో జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు దీటుగా అభ్యర్థులను పోటీలో నిలిపారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో లక్ష ఓట్లు ఉన్న మున్సిపాలిటీ పై బీఆర్ఎస్, సిపిఎం జెండా ఎగరవేసేందుకు పోటాపోటీగా ప్రచారాలు సాగిస్తున్నారు.

అధికార కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో రెబల్స్ బెడద కూడా తప్పడం లేదు. కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికి కాకుండా ఇతరులకు టికెట్లు ఇచ్చారని, కొన్ని వార్డులలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి వెంటనే టికెట్లు ఇచ్చారని రెబల్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే ఆయా అవార్డులలో రెబల్ అభ్యర్థులే ముందంజలో ఉన్నట్లు ప్రచారం సాగుతుండటంతో ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారిందని చెప్పవచ్చును.

కింగ్ మేకర్ ఎవరు..?

ఈ మున్సిపల్ ఎన్నికల్లో కింగ్ మేకర్ ఎవరు అనేది చర్చనీయాంశంగా మారింది. అధికార కాంగ్రెస్ పార్టీలో గ్రూపుల లొల్లి కారణంగా నామినేషన్ సందర్భంలోనే ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కుటుంబం నుంచి ముగ్గురు నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అధిష్టాన జోక్యం.. గ్రూపుల సమస్య సద్దుమణిగిందని ఆ ముగ్గురు నామినేషన్ విరమించుకున్న విషయం కూడా తెలిసిందే. కాగా అధికార కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠం దక్కించుకోవాలంటే పట్టణంలోని 48 వార్డులలో కనీసం 23 వార్డులు సొంతం చేసుకుంటే ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఓట్లతో చైర్మన్ స్థానం దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.

బీఆర్ఎస్, సిపిఎం పొత్తులో భాగంగా నల్లమోతు భాస్కరరావు, జూలకంటి రంగారెడ్డి రాజకీయ చతురత మున్సిపల్ ఎన్నికల్లో కనిపించే అవకాశాలు ఉన్నాయి. చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ అభ్యర్థులను బరిలోకి దింపారు దాంతో ఈ ఎన్నికల్లో కింగ్ మేకర్ మాజీ ఎమ్మెల్యేలు భాస్కరరావు, జూలకంటి రంగారెడ్డి అవుతారా..? లేదా ప్రస్తుత ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి అవుతారా..? అనేది వేచి చూడాల్సిందే.

MOST READ

  1. Nalgonda : నల్గొండ జిల్లాలో సాగర్ ఎడమ కాలువలో గల్లంతైన కారు బయటకు.. మృతదేహాలు..!

  2. Rythu Bharosa : రైతులకు శుభవార్త.. రైతు భరోసా డేట్ ఫిక్స్..!

  3. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ విజయారెడ్డి ఆత్మహత్య మిస్టరీ వీడిందా.. ఆ రెండు రోజులు ఏం జరిగింది..!

  4. Miryalaguda : శాగ జలంధర్ రెడ్డి, జయలక్ష్మి దంపతులను గెలిపించాలి..!

మరిన్ని వార్తలు