Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : నల్గొండ జిల్లాలో సాగర్ ఎడమ కాలువలో గల్లంతైన కారు బయటకు.. మృతదేహాలు..!

నల్గొండ జిల్లా నిడమనూరు మండలం  ముకుందాపురం వద్ద ఉన్న ఎన్ఎస్పీ కెనాల్ లో శనివారం రాత్రి కారు అదుపుతప్పి పడిపోయిన సంఘటనపై రెవెన్యూ, పోలీస్, ఫైర్, ఎస్ డి ఆర్ఎఫ్ బృందాలు తక్షణం స్పందించి సహాయక చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు.

Nalgonda : నల్గొండ జిల్లాలో సాగర్ ఎడమ కాలువలో గల్లంతైన కారు బయటకు.. మృతదేహాలు..!

నల్గొండ, మన సాక్షి :

నల్గొండ జిల్లా నిడమనూరు మండలం  ముకుందాపురం వద్ద ఉన్న ఎన్ఎస్పీ కెనాల్ లో శనివారం రాత్రి కారు అదుపుతప్పి పడిపోయిన సంఘటనపై రెవెన్యూ, పోలీస్, ఫైర్, ఎస్ డి ఆర్ఎఫ్ బృందాలు తక్షణం స్పందించి సహాయక చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. ఆదివారం అయన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో కలిసి ముకుందాపురం వద్ద సంఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు.

సంఘటన జరగడానికి గల కారణాలను, కారు ప్రమాద సంఘటనలో చనిపోయిన వారి
వివరాలను, ఇతర వివరాలను స్థానికులు, అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు అనంతరం ఇదే విషయం పై ఆయన మీడియాతో మాట్లాడుతూ శనివారం రాత్రి సుమారు 7:30 గంటల సమయంలో నల్గొండ జిల్లా, త్రిపురారం మండలం ,కంప సాగర్ కు చెందిన భార్యా భర్తలు పుల్లయ్య, పద్మ లు ప్రయాణిస్తున్న కారు ముకుందాపురం వద్ద ఉన్న ఎన్ఎస్పీ కెనాల్ లో ఆదుపుతప్పి పడిపోవడం జరిగింది.

విషయం తెలిసిన వెంటనే రెవిన్యూ, పోలీస్, ఫైర్,గజ ఈతగాళ్ళు, ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాలు ప్రమాద స్థలాన్ని చేరుకొని గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అయితే రాత్రి సమయమైనందున కారును వెంటనే బయటకు తీయలేకపోవడం జరిగిందని, ఆదివారం ఉదయం రెస్క్యూ బృందాలు కారును బయటికి తీశాయని, అలాగే ప్రమాదంలో మృతి చెందిన పద్మ మృతదేహం లభ్యం కాగా భర్త పుల్లయ్య మృతదేహం దొరకాల్సి ఉందని, అన్ని బృందాలు ఆదివారం ఉదయం నుండి గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో గల్లంతైన పుల్లయ్య మృతదేహాన్ని వెలికి తీస్తామని, ఈ సంఘటనలో ఎన్ డి ఆర్ ఎఫ్ బృందం కూడా తమతో సమన్వయం చేస్తున్నట్లు తెలిపారు.

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ శనివారం రాత్రి 7:30 ప్రాంతంలో ముకుందాపురం వద్ద ఎన్ఎస్పీ కెనాల్ లో కారు అదుపుతప్పి పడిపోయిన సంఘటనలో రెవెన్యూ, పోలీస్ అధికారులు తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టాయని, కారును వెంటనే గుర్తించినప్పటికీ చీకటి కారణంగా శనివారం వెలికి తీయలేక పోయామని, ఆదివారం ఉదయమే కారు ను బయటకు తీయడం జరిగిందని, అలాగే చనిపోయిన మహిళ మృతదేహాన్ని కూడా వెలికి తీశామని, అన్ని శాఖల సమన్వయం, సహకారంతో గల్లంతైన పుల్లయ్య మృతదేహాన్ని కూడా వెలికి తీస్తామని తెలిపారు.

రెవిన్యూ ఆదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై . అశోక్ రెడ్డి, మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు, స్థానిక రెవెన్యూ, పోలీస్,ఇతర అధికారులు, తదితరులు ఉన్నారు.

MOST READ 

Narayanpet : రూ.1.57లక్షల విలువ గల వస్త్రాలు, 2.89 లక్షల నగదు పట్టివేత..!

Gold Rate Today : మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈరోజు ఎంతంటే.. లేటెస్ట్ అప్డేట్..!

Miryalaguda : మిర్యాలగూడలో కాంట్రాక్టర్ నూకల హనుమంత రెడ్డి మృతి.. పలువురి సంతాపం..!

TG News : ఉద్యోగుల వేతనాల విడుదలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

మరిన్ని వార్తలు