Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంతెలంగాణసినిమాహైదరాబాద్

నటి అనసూయకు బిగ్ షాక్..!

ప్రముఖ టీవీ యాంకర్, నటి అనసూయ భరద్వాజకు బిగ్ షాక్ తగిలింది. హైదరాబాదులోని బోరబండ పోలీస్ స్టేషన్ లో ఆమెపై బీజేపీ నాయకులు కేసు నమోదు చేశారు.

నటి అనసూయకు బిగ్ షాక్..!

మన సాక్షి, హైదరాబాద్:

ప్రముఖ టీవీ యాంకర్, నటి అనసూయ భరద్వాజకు బిగ్ షాక్ తగిలింది. హైదరాబాదులోని బోరబండ పోలీస్ స్టేషన్ లో ఆమెపై బీజేపీ నాయకులు కేసు నమోదు చేశారు. బోరబండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి పలు విషయాలను బిజెపి పార్టీ నేతలు ప్రస్తావించారు. ఆమె హిందూ మతం పై అనుచిత వ్యాఖ్యలు చేశారని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె వ్యాఖ్యలు కోట్లాదిమంది హిందువుల మనోభావాలు దెబ్బతీశాయి అంటూ ఫిర్యాదులు పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అనసూయకు బిజెపి నేతలు వార్నింగ్ ఇచ్చారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడిన అనసూయ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జైశ్రీరామ్ ముసుగులో కొందరు దాడులకు దిగుతున్నారంటూ అనసూయ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ విషయం పైన బిజెపి నేతలు ఫిర్యాదు చేశారు.

ఇవి కూడ చదవండి 

మరిన్ని వార్తలు