Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుయాదాద్రి భువనగిరి జిల్లా

బోనాల పండుగలో అపశృతి.. ట్రాక్టర్ పల్టీ కొట్టడంతో ఒకవ్యక్తి మృతి..!

బోనాల పండుగ సందర్భంగా అపశృతి నెలకొన్నది. తుంగతుర్తి నియోజకవర్గంలోని అడ్డ గూడూరు మండలం చెవుల రామారంలో ట్రాక్టర్ బోల్తా పడి ఒక వ్యక్తి మృతి చెందారు.

బోనాల పండుగలో అపశృతి.. ట్రాక్టర్ పల్టీ కొట్టడంతో ఒకవ్యక్తి మృతి..!

తుంగతుర్తి, మన సాక్షి :

బోనాల పండుగ సందర్భంగా అపశృతి నెలకొన్నది. తుంగతుర్తి నియోజకవర్గంలోని అడ్డ గూడూరు మండలం చెవుల రామారంలో ట్రాక్టర్ బోల్తా పడి ఒక వ్యక్తి మృతి చెందారు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. వివరాల ప్రకారం.. బోనాల పండుగ ముగించుకొని ఇంటికి వస్తున్న సమయంలో కట్ట మైసమ్మ గుడి చుట్టూ ట్రాక్టర్ తిరుగుతున్న సమయంలో పల్టీ కొట్టింది. ఈ సంఘటనతో ట్రాక్టర్ యజమాని ఎల్లబోయిన సాయికుమార్ తీవ్ర గాయాలతో మృతి చెందారు. మరో వ్యక్తికి కూడా గాయాలయ్యాయి. గాయాలైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు