యువకుడు కత్తితో ముగ్గురిపై దాడి.. తీవ్ర గాయాలు
వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం మల్కాపురం గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మొక్కజొన్న గింజలపై ట్రాక్టర్ తో తొక్కించగా ఎందుకు అలా చేశావని, ప్రశ్నించిన వారిపై కత్తితో దాడి చేసిన ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

యువకుడు కత్తితో ముగ్గురిపై దాడి.. తీవ్ర గాయాలు
మహబూబ్ నగర్ జిల్లా, మన సాక్షి
వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం మల్కాపురం గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మొక్కజొన్న గింజలపై ట్రాక్టర్ తో తొక్కించగా ఎందుకు అలా చేశావని, ప్రశ్నించిన వారిపై కత్తితో దాడి చేసిన ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఎస్ఐ నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు కంకట్ల లక్ష్మమ్మ (44) పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు మంగళవారం రాత్రి 7:30 గంటల సమయంలో తాను, తన కుమారుడు కంకట్ల శివకుమార్ గ్రామంలోని కొండపై ఉన్న దేవాలయం దగ్గర వాటర్ ట్యాంక్ వద్ద ఉన్న సీసీ రోడ్డుపై మొక్కజొన్న గింజలపై ఆర బోసి ఉన్నాయి.
అదే సమయంలో అదే గ్రామానికి చెందిన చందు తన ట్రాక్టర్ తో వచ్చి ఆరబోసి ఉన్న మొక్కలపై ట్రాక్టర్ తో తొక్కించగా.. ఎందుకు తొక్కించవని లక్ష్మమ్మ కుమారుడు శివకుమార్ ప్రశ్నించగా, చందు బూతులు తిట్టి అక్కడి నుండి వెళ్లిపోయాడు.
మళ్లీ ట్రాక్టర్ పై వచ్చి తన వద్ద ఉన్న కత్తితో దాడికి పాల్పడ్డాడు. దాడిలో కంకట్ల శివకుమార్ పై కత్తితో దాడి చేయగా కుడి భుజానికి, ఎడమ కణతకు రక్త గాయాలయ్యాయి. గొడవను ఆపేందుకు వచ్చిన చాకలి హరికృష్ణ పై కూడా కత్తితో దాడి చేయగా కుడి చేతిపై గాయమైంది. కుమ్మరి రాఘవేందర్ పై దాడి చేయగా ఎడమ వైపు గాయమైంది.
కత్తితో దాడి చేసి గాయపరిచిన చిన్న కుర్వ చందుపై చట్టపరమైన తీసుకోవాలని బాధితురాలు లక్ష్మమ్మ పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు నవాబుపేట్ ఎస్సై నరేందర్ తెలిపారు.