ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో ఎమ్మెల్సీ అభ్యర్థుల భేటీ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అభ్యర్థులు బుధవారం భేటీ అయ్యారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో ఎమ్మెల్సీ అభ్యర్థుల భేటీ
సూర్యాపేట, మనసాక్షి :
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అభ్యర్థులు బుధవారం భేటీ అయ్యారు. నల్లగొండ–ఖమ్మం–వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్నగర్ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డిలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పుష్పగుచ్చం అందజేశారు.
ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఖరారైనందున ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం, పార్టీ కార్యక్రమాలు, గ్రాడ్యుయేట్ ఓటర్ల సమన్వయంపై చర్చించారు.
తమను అభ్యర్థిగా ఎంపిక చేసిన పార్టీ అధిష్ఠానానికి, పీసీసీ అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సమన్వయంతో ఎన్నికల్లో ముందుకు సాగుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాంరెడ్డి కృష్ణారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ కొండపల్లి దిలీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.









