Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుBreaking Newsక్రైంనారాయణపేట జిల్లా

Narayanpet : రూ.1.57లక్షల విలువ గల వస్త్రాలు, 2.89 లక్షల నగదు పట్టివేత..!

మున్సిపల్ ఎన్నికల నిబంధ నలను కట్టుదిట్టంగా అమలు చేయాలనే జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మేరకు నారాయణపేట పట్టణ పరిధిలోని ఎర్ర గుట్ట చెక్‌పోస్ట్ వద్ద శనివారం టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు ఆధ్వ ర్యంలో చెక్ పోస్ట్ పోలీసులు ముమ్మరంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు.

Narayanpet : రూ.1.57లక్షల విలువ గల వస్త్రాలు, 2.89 లక్షల నగదు పట్టివేత..!

నారాయణపేట టౌన్, మన సాక్షి :

మున్సిపల్ ఎన్నికల నిబంధ నలను కట్టుదిట్టంగా అమలు చేయాలనే జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మేరకు నారాయణపేట పట్టణ పరిధిలోని ఎర్ర గుట్ట చెక్‌పోస్ట్ వద్ద శనివారం టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు ఆధ్వ ర్యంలో చెక్ పోస్ట్ పోలీసులు ముమ్మరంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీలలో భాగంగా గుర్మిట్కల్ నుండి నారాయ ణపేట వైపు వస్తున వాహ నంలో రూ.1,57,420 విలువ గల దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దుస్తులు మహమ్మద్ తాకి, నవాజ్, గుర్మిట్కల్‌కు చెందిన వారుతరలిస్తుండగా పట్టు కొని, మున్సిపల్ ఎన్నికల నిబంధనల మేరకు గ్రీవెన్స్ కమిటీకి అప్పగించడం జరిగిందని టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

అలాగే చెక్‌పోస్ట్ తనిఖీల సమయంలో అనుమానా స్పదంగా నగదు తరలిస్తున్న ఇద్దరి వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు.మల్లికార్జున, బలిచక్రం, గుర్మిట్కల్ 1,80,000, జాఫర్1,09,300 మొత్తం 2,89,300 నగదును సీజ్ చేసి, ఎన్నికల నియమా వళి ప్రకారం గ్రీవెన్స్ కమిటీకి అప్పగించడం జరిగిందని ఆయన తెలిపారు.ఈ సంద ర్భంగా టౌన్ ఎస్ఐ వెంకటే శ్వర్లు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలంటే ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధ నలను తప్పనిసరిగా పాటించాలన్నారు.

అను మతులు లేకుండా నగదు లేదా వస్తువులు తరలించరాదని హెచ్చరించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నంత వరకు చెక్‌పోస్ట్‌ల వద్ద వాహనాల తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకుం టామని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు