Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

Miryalaguda : మిర్యాలగూడలో కాంట్రాక్టర్ నూకల హనుమంత రెడ్డి మృతి.. పలువురి సంతాపం..!

మిర్యాలగూడ మాజీ ఎంపీపీ నూకల సరళ భర్త, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నూకల హనుమంత రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు.

Miryalaguda : మిర్యాలగూడలో కాంట్రాక్టర్ నూకల హనుమంత రెడ్డి మృతి.. పలువురి సంతాపం..!

మిర్యాలగూడ, మన సాక్షి:

మిర్యాలగూడ మాజీ ఎంపీపీ నూకల సరళ భర్త, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నూకల హనుమంత రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు.

శుక్రవారం ఉదయం మిర్యాలగూడ పట్టణంలోని హనుమంత రెడ్డి నివాసానికి సతిమతి నల్లమోతు జయ, యువనేత నల్లమోతు సిద్దార్ధ తో చేరుకున్న నల్లమోతు భాస్కర్ రావు ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

నూకల హనుమంత రెడ్డి మరణం పార్టీకి మరియు ఈ ప్రాంతానికి తీరని లోటు, నిరంతరం ప్రజల కోసం, పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన నిబద్ధత గల నాయకుడిని మనం కోల్పోయాం.. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ఈ కష్ట సమయంలో మనోదైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని భాస్కర్ రావు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో భాస్కర్ రావు తో పాటు స్థానిక బీఆర్ఎస్ నాయకులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, పాశం నరసింహ రెడ్డి, చౌగాని బిక్షం గౌడ్, మిర్యాలగూడ మండల బీఆర్ఎస్ నాయకులు పాల్గొని హనుమంత రెడ్డి కి నివాళులర్పించారు.

IMP NEWS 

మరిన్ని వార్తలు