ఆంధ్రప్రదేశ్Breaking Newsక్రైం
BREAKING : రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం..!
ఆంధ్రప్రదేశ్‌లో ని చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు.

BREAKING : రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
ఆంధ్రప్రదేశ్‌లో ని చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. ఇరువారం సర్కిల్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో స్థానికులు తీవ్రభయాందోళనలకు గురయ్యారు.
వేగంగా వెళుతున్న కారు.. కంటైనర్ లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. కంటైనర్ కిందికి కారు దూసుకుపోవడంతో లోపల ఉన్నవారు బయటకు రావడానికి అవకాశం లేకుండా పోయింది. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గ్యాస్ కట్టర్ల సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.









