Uncategorized
Breaking : పెన్‌పహాడ్ మండలంలో చెట్టుకు ఊరి వేసుకొని యువకుడి మృతి..!
సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం అనంతారం ఎక్స్ రోడ్ వద్ద శనివారం విషాద ఘటన చోటు చేసుకుంది. చెట్టుకు ఉరివేసుకొని ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు గుర్తించారు.

Breaking : పెన్‌పహాడ్ మండలంలో చెట్టుకు ఊరి వేసుకొని యువకుడి మృతి..!
పెన్ పహాడ్, మన సాక్షి:
సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం అనంతారం ఎక్స్ రోడ్ వద్ద శనివారం విషాద ఘటన చోటు చేసుకుంది. చెట్టుకు ఉరివేసుకొని ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు గుర్తించారు.
మృతుడు గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ గా గుర్తింపు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సూర్యపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. యువకుడు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- Breaking : హైదరాబాద్ – నాగార్జునసాగర్ హైవేపై రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి..!
- Talent : చదువుకు పేదరికం అడ్డు కాదని నిరూపించింది.. ఇంటర్ లో ప్రథమ స్థానంలో నిలిచిన తులసి..!
- Rythu : రైతులకు బిగ్ అలర్ట్.. ఒకే మొబైల్ నెంబర్ ను వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి..!
- TG News : పునర్విభజనతో తెలంగాణలో పెరగనున్న ఎంపీ స్థానాలు.. ఏ జిల్లాలో పెరగనున్నాయో తెలుసా..!