Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణ

TG News : పునర్విభజనతో తెలంగాణలో పెరగనున్న ఎంపీ స్థానాలు.. ఏ జిల్లాలో పెరగనున్నాయో తెలుసా..!

దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ నియోజకవర్గాల పునర్విభజన బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ (ఎంపీ ) స్థానాలు పెరగనున్నాయి.

TG News : పునర్విభజనతో తెలంగాణలో పెరగనున్న ఎంపీ స్థానాలు.. ఏ జిల్లాలో పెరగనున్నాయో తెలుసా..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో:

దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ నియోజకవర్గాల పునర్విభజన బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ (ఎంపీ ) స్థానాలు పెరగనున్నాయి. దేశవ్యాప్తంగా 850 కి ఎంపీ స్థానాలు చేరే అవకాశం ఉంది. అందులో భాగంగా తెలంగాణలో కూడా పార్లమెంటు స్థానాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.

ప్రస్తుతం తెలంగాణలో 17 లోక్ సభ (ఎం పి ) స్థానాలు ఉన్నాయి. పునర్విభజన కారణంగా మరో తొమ్మిది లోక్ సభ నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంది. 2029 లోనే ఈ కొత్త నియోజకవర్గాల ఎన్నికలు జరిగేలా కేంద్రం కసరత్తు చేస్తుంది.డి  లిమిటేషన్ ప్రక్రియతో పాటు మహిళా బిల్లును కూడా అమలు చేసే అవకాశాలు ఉన్నాయి.

తెలంగాణలో హైదరాబాద్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, భువనగిరి నియోజకవర్గాల పరిధిలో అధిక జనాభా ఉన్నారు. వాటిని దృష్టిలో పెట్టుకొని లోక్ సభ స్థానాలను కూడా పెంచే అవకాశం ఉంది. రాష్ట్రం లో మొత్తం 9 లోక్ సభ స్థానాలు పెరిగే అవకాశం ఉంది.

పెరగనున్న స్థానాలు :

* ఈ నాలుగు నియోజకవర్గాల పరిధిలోనే మరో మూడు కొత్త స్థానాలు పెంచే అవకాశం ఉంది. మల్కాజ్గిరి నియోజకవర్గం దేశంలోనే అత్యధికంగా ఓటర్లు ఉన్న నియోజకవర్గం కావడం వల్ల ఇది రెండు నియోజకవర్గాలుగా మారే అవకాశం ఉంది.

* ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల పరిధిలో కొత్తగా మరో రెండు లోక్ సభ స్థానాలు ఏర్పాటు కానున్నాయి.

* ఉమ్మడి మెదక్ జిల్లాలో మరో లోక్ సభ స్థానం పెరగనున్నది.

* మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ ను విభజించి మరో స్థానం ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరగనున్నది.

* వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పరిధిలో మరో రెండు లోక్ సభ స్థానాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.

ఇదిలా ఉండగా 2029 ఎన్నికల నుంచి మహిళా బిల్లు అమలులోకి వస్తే మహిళలకు 9 లోక్సభ స్థానాలను కేటాయించే అవకాశాలు ఉన్నాయి. డీలిమిటేషన్ కమిటీ ఏర్పాటు తర్వాత అభిప్రాయ సేకరణ, కేంద్రానికి ఇచ్చే నివేదిక, ప్రజాభిప్రాయం తీసుకున్న తర్వాత కొత్త నియోజకవర్గాల గెజిట్ వెలువడనున్నది. నియోజకవర్గాల పునర్ విభజన రాష్ట్రవ్యాప్తంగా రాజకీయంగా ఆసక్తి నెలకొన్నది.

ఇవి కుడా చదవండి 

మరిన్ని వార్తలు