Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంతెలంగాణహైదరాబాద్

Hyderabad : పిల్లలతో కలిసి రైలుకు ఎదురెల్లి ఆత్మహత్య చేసుకున్న విజయరెడ్డి కేసు లో బిగ్ ట్విస్ట్..!

హైదరాబాద్ లోని చర్లపల్లి వద్ద జనవరి 30న రాత్రి ఇద్దరు పిల్లలతో కలిసి రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డి (38) ఉదంతంలో బిగ్ ట్విస్ట్ నెలకొన్నది.

Hyderabad : పిల్లలతో కలిసి రైలుకు ఎదురెల్లి ఆత్మహత్య చేసుకున్న విజయరెడ్డి కేసు లో బిగ్ ట్విస్ట్..!

హైదరాబాద్, మన సాక్షి :

హైదరాబాద్ లోని చర్లపల్లి వద్ద జనవరి 30న రాత్రి ఇద్దరు పిల్లలతో కలిసి రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డి (38) ఉదంతంలో బిగ్ ట్విస్ట్ నెలకొన్నది. విజయరెడ్డి భర్త సురేందర్రెడ్డి సోమవారం సంచలన ఆరోపణలు చేశారు. తన భార్యాపిల్లలు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాళ్లు కాదని, ఈ ఘటనపై పలు అనుమానాలు ఉన్నాయని. తన అత్త పుష్పలత, బావమరిది చిరంజీవిరెడ్డి, వారి కుటుంబ సభ్యుల పాత్ర ఉందని మేడిపల్లి పోలీసులకు ఇచ్చిన ఫిద్యాదులో పేర్కొన్నారు.

దీనిపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
అలాగే తనకు రక్షణ కల్పించాలని కోరారు. జనవరి లో జరిగిన సంఘటన మళ్ళీ తెరపై కి వచ్చింది. అప్పట్లో సంచలనం అయి కేసు దర్యాప్తు లో కూడా ఏమి లభ్యం కాలేదు. ఇప్పుడు ఆమె భర్త పిర్యాదు తో మరోసారి వెలుగు లోకి వచ్చింది.

‘ఆస్తులన్నీ పిల్లల పేర్ల మీద ఉన్నాయి. రియల్ ఎస్టేట్ పేరుతో నా భార్య డబ్బులను వాడుకున్నారు. దుర్ఘటన జరిగిన రోజు మా ఇంట్లో రూ.1.40 లక్షల నగదు. బంగారం మాయమ య్యాయి, సొంతవాళ్లే నమ్మించి మోసం చేశారు. ఆస్తి కోసం నా కుటుంబాన్ని నాకు దూరం చేశారు. నా భార్య, పిల్లలు మృతి చెందిన 25 రోజులకే నన్ను బెదిరించారు. నాకు ప్రాణహాని ఉంది’ అని విజయరెడ్డి భార్త పిర్యాదు లో పేర్కొన్నారు.

ఆరోపణలు అసత్యం:

సురేందర్రెడ్డి ఆరోపణలు పూర్తిగా
ఆవాస్తవమని విజయారెడ్డి తమ్ముడు చిరంజీవిరెడ్డి ఖండించారు. వయసులో 16 ఏళ్ల తేడా ఉండగా, కేవలం మూడేళ్లు వ్యత్యాసం అని చెప్పి సురేందర్రెడ్డి తన సోదరిని మోసగించాడని, చాలా ఆస్తులున్నట్లు చెప్పాడు. దుబాయ్ తీసుకెళ్తానని చెప్పి వంచించాడు. నైట్ షిఫ్ట్స్ ఇతరులతో సంబందాలు పెట్టుకున్నావని వేధించేవాడు. కేసును తప్పుదోవ పట్టించేందుకే ప్రాణహాని అంటూ సురేందర్రెడ్డి ఆరోపణలు చేస్తున్నాడు.

నిజాలు వెలుగులోకి రావాలంటే అతడి కాల్ డేటాపై విచారణ చేయాలి’ అని పోలీసులను కోరారు. కాగా, విచారణ కావాలనుకుంటే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులను ఆశ్రయించాలని సురేందర్రెడ్డికి మేడిపల్లి సీఐ చింత శంకరయ్య సూచించారు.

ఇవి కూడా చదవండి 

మరిన్ని వార్తలు