Nelakondapalli : రూ.5 కోట్ల తో బౌద్ధక్షేత్రం చరిత్ర ప్రపంచం కు తెలిసేలా అభివృద్ధి..!

Nelakondapalli : రూ.5 కోట్ల తో బౌద్ధక్షేత్రం చరిత్ర ప్రపంచం కు తెలిసేలా అభివృద్ధి..!
నేలకొండపల్లి, మన సాక్షి:
బౌద్ధక్షేత్రం చరిత్ర ను ప్రపంచం కు తెలిసేలా అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర పురావస్తు శాఖ డైరెక్టర్ అర్జున్రావు పేర్కోన్నారు. స్థానిక బౌద్ధక్షేత్రం ను శనివారం సందర్శించారు. క్షేత్రం ఆవరణ అంతా కలియ తిరిగారు. చరిత్ర ను తెలిపే బోర్డులు తుప్పు పట్టటంతో వాటి స్థానంలో కొత్తగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
అడవిని తలపించే విధంగా ఉన్న పిచ్చి చెట్లు, మొక్కలను తొలిగించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు… రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలలో అభివృద్ధి పరిచేందుకు రూ.5 కోట్లతో కార్యచరణ ను రూపొందించినట్లు తెలిపారు.
చరిత్ర కలిగిన ఫణిగిరి, ‘నేలకొండపల్లి, రాజులబండ, దూళికట్ట, కొటీలింగం ప్రాంతాల పై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. చిట్టఅడవి ని తలపించే విధంగా ఉన్న బౌద్ధ సూస్థం పరిసరాలను శుభ్రపరచాలని ఆయన చెప్పారు. బౌద్ధస్థూపం పరిరక్షణ చర్యలు తీసుకునే విధంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి పరిచి భావితరాలకు వారసత్వ సంపదగా గుర్తుండిపోయే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. త్వరలోనే ప్రవేట్ భాగస్వామ్యంతో పర్యాటక ప్రదేశాల వద్ద గైడ్ల ను నియమించనున్నట్లు తెలిపారు.
పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కోసం ఆర్కియాలజీ-టూరిజం శాఖల సమన్వయంతో ప్రాజెక్ట్ రిపోర్టు ‘ రూపొందించినట్లు తెలిపారు. నేలకొండపల్లి బౌద్ధక్షేత్రం వద్ద మిని మ్యూజియం ఏర్పాటు కు ప్రతిపాధనలు సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు.
బౌద్ధక్షేత్రం సంరక్షణ కోసం పనులు చేపట్టటానికి జిల్లా కలెక్టర్ పురావస్తు శాఖ కు నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్లు నర్సింగ్, నాగరాజు, ఏడీ. బుజ్జి, జిల్లా పర్యాటక శాఖ అధికారి సుమన్ చక్రవర్తి, నేలకొండపల్లి తహశీల్దార్ వి.వెంకటేశ్వర్లు, ఆర్.ఐ.అల్లం రవికుమార్, జీపీవో జానిమియా తదితరులు పాల్గొన్నారు.
MOST READ :









