Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsఉద్యోగంజిల్లా వార్తలునారాయణపేట జిల్లావిద్య

District collector : అందత్వ అభ్యర్థి గ్రూప్-2 పరీక్ష.. నిశితంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్..!

District collector : అందత్వ అభ్యర్థి గ్రూప్-2 పరీక్ష.. నిశితంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నారాయణపేట జిల్లా కేంద్రంలో జరుగుతున్న గ్రూప్ -2 పరీక్షా కేంద్రాలను ఆదివారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. పట్టణంలోని బ్రిలియంట్, శ్రీ సరస్వతి శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న గ్రూప్-2 పరీక్షా సరళిని కలెక్టర్ పర్యవేక్షించారు. ఆయా కేంద్రాలలో ఆదివారం నాటి పరీక్షకు ఎంతమంది అభ్యర్థులు హాజరయ్యారు?.. ఎంత మంది గైర్హాజరు అయ్యారని అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

పరీక్ష నిర్వహణ గదులను, వైద్య, ఇతర సౌకర్యాలను కలెక్టర్ తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాలలో అభ్యర్థులకు మౌలిక సదుపాయాలను కల్పించాలని సూచించారు. అయితే శిశు మందిర్ పాఠశాల కేంద్రంలో ఓ అంధత్వ అభ్యర్థి సహాయకురాలి సహాయంతో పరీక్ష రాస్తుండటాన్ని కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. పరీక్ష ముగిసిన తర్వాత జవాబు ( ఓ ఎం ఆర్) పత్రాలను ఎలా తీసుకు వెళ్తారని, రూట్ అధికారి ఎవరు అని ఆ కేంద్ర అధికారిని అడిగి తెలుసుకున్నారు.

ముఖ్యమైన వార్తలు

Onion : సామాన్యులకు షాక్.. మళ్లీ పెరుగుతున్న ఉల్లిగడ్డ ధరలు..!

Rythu : రైతులకు డబుల్ బొనాంజ.. గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం..!

Gold Price : పసిడి పతనం.. భారీగా రూ.9800 తగ్గిన ధర, తులం ఎంతంటే..!

Rythu Bharosa : రైతు భరోసా రూ.7500.. వారికి మాత్రమే, లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు