Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : తెలుగుదేశం పార్టీ శ్రేణుల సంబరాలు..!

Nalgonda : తెలుగుదేశం పార్టీ శ్రేణుల సంబరాలు..!

నల్లగొండ.. మనసాక్షి .

ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం స్థానిక పార్టీ కార్యాలయం వద్ద బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు .

ఈ సందర్భంగా నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం ఇన్చార్జ్ ఎల్వి యాదవ్ మాట్లాడుతూ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలందరికీ శుభదినం అన్నారు. చంద్రబాబు నాయుడు నవ యువకుని మాదిరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తారన్నారు.

ఐదు సంవత్సరాలుగా విధ్వంసపాలన చూసిన ప్రజలు చంద్రబాబు నాయుడుకు తిరుగులేని మెజార్టీ ఇచ్చారని ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇండియా కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఆశించిన విధంగా పాలన సాగిస్తూ ప్రజలను మెప్పిస్తుందన్నారు .

ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గుండు వెంకటేశ్వర్లు ,కూరల విజయకుమార్, ఆకునూరు సత్యనారాయణ ,ఎంకే సిద్ధిక్ ,కొండేటి దయాకర్, మహేశ్వరం గోపాల్, పాలడుగు నాగరాజు, గోగుల నాగరాజు కుమార్, దాడి మధుసూదన్ రెడ్డి, గంగాధర్ స్వరాజ్ ,బొంత రమేష్, అనిత, భూతం వెంకటయ్య, కూరపాటి కిషోర్, దండంపల్లి శంకర్, కొణిదెల విజయ్, కటికుంట్ల శివ ,ఆరునెల కొండల్ తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : 

TDP : టిడిపి నేతల సంబరాలు..!

Sharmila : జగన్ ను వదలని సోదరి షర్మిల.. మళ్లీ గేమ్ స్టార్ట్..!

Chandrababu : నారా చంద్రబాబు నాయుడు అనే నేను..!

మరిన్ని వార్తలు