Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESఆంధ్రప్రదేశ్రాజకీయం

Sharmila : జగన్ ను వదలని సోదరి షర్మిల.. మళ్లీ గేమ్ స్టార్ట్..!

Sharmila : జగన్ ను వదలని సోదరి షర్మిల.. మళ్లీ గేమ్ స్టార్ట్..!

మన సాక్షి :

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించడంలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మిల మరోసారి విఙ్రుంభించేందుకు రెడీ అవుతున్నారా..? అంటే నిజమే అని చెప్పవచ్చును. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వానికి దీటుగా సమాధానం చెప్పేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని షర్మిల చెప్పకనే చెబుతున్నారు.

వైసిపి కి సహకరించిన సామాజిక వర్గాలను కాంగ్రెస్ వైపు తిప్పుకునేందుకు షర్మిల అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టేందుకు ఆ పార్టీ అధిష్టానం కూడా షర్మిలకు రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీకి గడ్డు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న వైసీపీని మరింత డీలా చేసేందుకు షర్మిల ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.  కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచిన వైసీపీ.. ఆ పార్టీ నేతలు కూడా అందరూ అధినేత జగన్ ను కలిసిన దాఖలాలు లేవు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం నుంచి కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ప్రధాన నాయకులు కూడా ఇప్పటివరకు జగన్ ను కలవలేదు.

దాంతో జగన్ కు దూరంగా ఉండే నాయకులను షర్మిల ఆకర్షించేందుకు ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీలోకి వారిని ఆహ్వానించి కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తుంది. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలు రాబోయే రోజుల్లో వైసిపికి ప్రమాదగంటికలు మోగే అవకాశం ఉంది.

ALSO READ : 

BREAKING : గడచిన ఐదేండ్లు విశృంఖల పాలన.. కొత్త ప్రభుత్వానికి వైఎస్ షర్మిల బహిరంగ లేఖ..!

Chandrababu : నారా చంద్రబాబు నాయుడు అనే నేను..!

Revanth : రేవంత్ రెడ్డి తర్వాత ఎవరు? ఏఐసీసీ కసరత్తు..!

NDA : ఎన్డీఏ ఏపీ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు.. అహంకారం కూలిపోయిందంటూ సంచలన కామెంట్..!

Runa Mafi : రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీకి విధి విధానాలు సిద్ధం, సర్వత్ర చర్చ..!

BREAKING : దేశవ్యాప్తంగా పేదలకు నరేంద్ర మోడీ గుడ్ న్యూస్.. మంత్రివర్గంలో ఆమోదం..!

మరిన్ని వార్తలు