Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్రాజకీయం

NDA : ఎన్డీఏ ఏపీ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు.. అహంకారం కూలిపోయిందంటూ సంచలన కామెంట్..!

NDA : ఎన్డీఏ ఏపీ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు.. అహంకారం కూలిపోయిందంటూ సంచలన కామెంట్..!

విజయవాడ, మన సాక్షి :

ఆంధ్ర ప్రదేశ్ ఎన్డీఏ శాసనసభా పక్ష నేతగా నారా చంద్రబాబు నాయుడును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విజయవాడలో నిర్వహించిన ఎన్ డి ఏ శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబు నాయుడు పేరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ఊహించని విధంగా గెలుపు సాధించామని ఎప్పుడూ లేనంతగా సాటిస్ఫాక్షన్ ఈ ఎన్నికల ద్వారా వచ్చిందన్నారు. శాసనసభాపక్ష నేతగా తనని ఎన్నుకున్నందుకు ఎమ్మెల్యే లందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భారీ మెజారిటీతో గెలిచిన మనం రాష్ట్ర బాధ్యతలు మరింతగా పెరిగాయన్నారు. టిడిపి జనసేన, బిజెపి కూటమి ఇలాంటి విజయం ఎన్నడూ చూడలేదు అన్నారు. సమావేశంలో బిజెపి ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షురాలు పురందేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

రేపు అందరి సహకారంతో ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నానని, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరవుతున్నట్లు చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.రాగద్వేషాలకు పోకుండా పరిపాలన సాగించడమే నాకు తెలుసని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రం పూర్తిగా శిథిలమైపోయిందని, దెబ్బతినని వర్గం అంటూ లేదని సంచలన కామెంట్ చేశారు.

బతుకుతెరువు కోసం ఎక్కడికో వెళ్లి బతుకుతున్నారని, వారంతా ఎన్నికల సమయంలో అన్నం కట్టుకొని వచ్చి తిని ఓటేసి వెళ్లారని పేర్కొన్నారు. అహంకారం కూలిపోయిందని, పదవి వచ్చిందని విర్రవీగి అహంకారంతో ఉంటే ఇలాంటిది జరుగుతుందని సుతిమెత్తగా హెచ్చరించారు. తప్పు చేసిన వాడికి చట్టపరంగా శిక్ష పడాల్సిన అవసరం ఉందన్నారు. ఐదు సంవత్సరాల కాలంలో కార్యకర్తలపై దాడులు, హింస రాజకీయాలు అక్రమ కేసులు కొనసాగాలని చంద్రబాబు పేర్కొన్నారు.

ALSO READ : 

Ap News : రేపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం.. హాజరుకానున్న నరేంద్ర మోడీ..!

BREAKING : దేశవ్యాప్తంగా పేదలకు నరేంద్ర మోడీ గుడ్ న్యూస్.. మంత్రివర్గంలో ఆమోదం..!

Runa Mafi : రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీకి విధి విధానాలు సిద్ధం, సర్వత్ర చర్చ..!

Modi Cabinet : చిన్న రాష్ట్రం.. గెలిచింది అయిదుగురు, ముగ్గురికి కేంద్ర మంత్రి పదవులు.. ఎందుకో తెలుసా..?

మరిన్ని వార్తలు