Holidays : సంక్రాంతి సెలవుల్లో మార్పులు.. ప్రకటించిన విద్యాశాఖ..!
Holidays : సంక్రాంతి సెలవుల్లో మార్పులు.. ప్రకటించిన విద్యాశాఖ..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో దసరా పండుగ తర్వాత ఎక్కువ రోజులు సెలవులు ప్రకటించే పండుగ సంక్రాంతి. ఈ ఏడాది సంక్రాంతి పండుగ సెలవుల విషయంలో అస్పష్టత కొనసాగుతుంది. ఏది ఏమైనా కళాశాలలు, పాఠశాలలకు సంక్రాంతి సెలవులను ఫైనల్ గా విద్యాశాఖ ప్రకటించింది. ఈ ఏడాది సంక్రాంతి పండుగకు ఐదు రోజుల సెలవులను ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
జనవరి 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు పాఠశాలలకు సెలవులు ఖరారు చేసింది. జనవరి 18వ తేదీన యధావిధిగా పాఠశాలలు పున ప్రారంభం కానున్నాయి. అయితే పండుగ ప్రారంభానికి ముందుగా 11 వ తేదీన రెండవ శనివారం, 12వ తేదీన ఆదివారం కావడంతో సంక్రాంతికి మరో రెండు రోజులు అదనంగా సెలవులు కలిసి రానున్నాయి.
అదేవిధంగా కళాశాలలకు కూడా ప్రభుత్వం సెలవులు ఖరారు చేసింది. కళాశాలలకు 17వ తేదీ వరకు సెలవులను ఖరారు చేసింది. 18వ తేదీన తిరిగి విద్యాసంస్థలు ప్రారంభం కానున్నప్పటికీ మరుసటి రోజు 19వ తేదీన ఆదివారం కావడంతో వెంటనే మరో సెలవు కూడా రానున్నది.
MOST READ :
-
Rythu Bharosa : రైతు భరోసా ఎకరానికి రూ.12 వేలే.. వారికి కట్, ఎప్పటినుంచంటే.. లేటెస్ట్ అప్డేట్..!
-
Virus : చైనాలో వైరస్ వ్యాప్తి.. తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన..!
-
Gold Price : కొత్త సంవత్సరంలో భారీ శుభవార్త.. రూ.4900 తగ్గిన బంగారం ధర..!
-
Ration card : రేషన్ కార్డులో మీ కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలా.. అయితే ఇలా చేయండి..!









