Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking News

Ration card : రేషన్ కార్డులో మీ కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలా.. అయితే ఇలా చేయండి..!

Ration card : రేషన్ కార్డులో మీ కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలా.. అయితే ఇలా చేయండి..!

మన సాక్షి, హైదరాబాద్ :

తెలంగాణలో పేదలు రేషన్ కార్డుల కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడం వల్ల రేషన్ కార్డులలో చాలామంది పేర్లు లేవు. అయితే తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది. కానీ అంతకుముందే రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చేందుకు అవకాశం కల్పించింది.

రేషన్ కార్డులో మార్పులు, చేర్పులు చేసుకునే వెసులుబాటును తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. అయితే ఎలా దరఖాస్తు చేయాలి..? పత్రాలు ఏమేం కావాలంటే..?

రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడానికి తప్పనిసరిగా ధ్రువీకరణ పత్రాలు అవసరం ఉంటాయి. భార్య పేరు చేర్చాలంటే అందుకు సంబంధించిన ఆధార్ కార్డు తో పాటు వివాహ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలి. అదే విధంగా పిల్లల పేర్లు చేర్చడానికి వారి బర్తడే సర్టిఫికెట్లు తప్పనిసరిగా ఉండాలి. ఈ సర్టిఫికెట్లతో మీ సమీపంలోని మీ సేవ కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవచ్చును.

MOST READ : 

మరిన్ని వార్తలు