viralBreaking Newsజాతీయం

Viral Video : బాయ్ ఫ్రెండ్ తో చాటింగ్.. పేరెంట్స్ కు దొరికింది, ఎలానో చూస్తే నవ్వుకోవాల్సిందే.. (Video)

Viral Video : బాయ్ ఫ్రెండ్ తో చాటింగ్.. పేరెంట్స్ కు దొరికింది, ఎలానో చూస్తే నవ్వుకోవాల్సిందే.. (Video)

మన సాక్షి, వెబ్ డెస్క్ :

ఇప్పుడు యువత ఎక్కువగా సోషల్ మీడియాలో గడుపుతున్నారు. వాట్సాప్, ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్ ఇలా అనేక రకాలుగా ప్రియమైన వారితో చాటింగ్ లు చేస్తున్నారు. తమ పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసుకోవడం పేరెంట్స్ కు కూడా పెద్ద సవాల్ గా మారింది. ఇంట్లో పెద్ద వాళ్లకు తెలియకుండా యువత చాటింగ్ లు చేస్తున్నారు.

అలాగే ఓ అమ్మాయి అందరు టీవీ చూస్తుండగా తన బాయ్ ఫ్రెండ్ తో ఫోన్లో చాటింగ్ చేస్తుంది. అయితే ఆ విషయం ఎవరితో ఏం చాటింగ్ చేస్తుందో ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోయింది. ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఇంట్లో వారంతా ఓ గదిలో కూర్చొని టీవీ చూస్తున్నారు. అయితే ఆ అమ్మాయి ఓ మంచం మీద కూర్చొని మొబైల్ లో తన బాయ్ ఫ్రెండ్ తో చాటింగ్ చేస్తుంది. అయితే ఆ అమ్మాయి చాటింగ్ చేసేది ఎవరూ చూడటం లేదని అనుకుంటుంది.

కానీ ఆ అమ్మాయి మొబైల్ టీవీకి కనెక్ట్ అయి ఉండడంతో ఆమె చేస్తున్న చాట్ అంతా టీవీ స్క్రీన్ పై కనిపిస్తుంది. ఆ వ్యవహారాన్ని అంతా కుటుంబ సభ్యులు గమనించారు. అసలు విషయం తెలుసుకున్న అమ్మాయి అవ్వక్కయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

VIDEO 

VIRAL VIDEOS :

Viral Video : టపాసులు ఇలా కూడా పేల్చొచ్చా.. బైకు ట్యాంకులో.. (వీడియో)

Viral Video : చల్లగా బీరు తాగుదామనుకుంటే.. ఓపెన్ చేయబోయి కంగుతిన్నారు, చంపేస్తారా బాబు.. (వీడియో)

Viral Video : ఆకలేస్తే పాములు వాటిని మింగుతాయి.. ఆ నాగుపాము మింగిన వాటిని ఏం చేస్తుంది.. (వీడియో)

Viral Video : ప్రియుడిని ట్రంకు పెట్టెలో దాచిన ప్రియురాలు.. ఎందుకో, ఎలా దాచిందో చూస్తే షాక్.. (వీడియో)

మరిన్ని వార్తలు