ACB : లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన సిఐ.. ఇద్దరు కానిస్టేబుల్స్..!

ACB : లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన సిఐ.. ఇద్దరు కానిస్టేబుల్స్..!
నారాయణపేట టౌన్, ఫిబ్రవరి 18 మనసాక్షి :-
నారాయణపేట జిల్లా మక్తల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ అవినీతి శాఖ అధికారులకు 20వేల రూపాయల నగదు లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డాడు. అవినీతి శాఖ అధికారులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
మక్తల్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఒక కేసులో చార్జిషీట్ దాఖలు చేస్తున్నప్పుడు కేసు తీవ్రతను తగ్గించేందుకు అధికారికంగా అనుకూలంగా వ్యవహరించడానికి ముందుగా ఫిర్యాదుధారుని నుండి రూ.40,000 వేలు లంచం డిమాండ్ చేసి అందులో నుండి రూ.20,000 వేలు తీసుకుంటుండగా అనిశా అధికారుల చేతికి చిక్కినట్లు వారు తెలిపారు.
సర్కిల్ ఇన్స్పెక్టర్ గుండెమోని చంద్ర శేఖర్ తో పాటు అదే సిఐ కార్యాలయంలో పనిచేసే ఇద్దరు కానిస్టేబుల్ లు సింగసాని శివ,కుర్వ నర్సింహులు లను అదుపులో తీసుకున్నట్లు వారు తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా సరే లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని ఈ సందర్భంగా వారు తెలిపారు.
MOST READ :









