CM Revanth Reddy : బీఆర్ఎస్, బిజెపిలకు డిపాజిట్లు రావద్దు..!
ప్రభుత్వం అందజేసే సంక్షేమ పథకాలు పొందిన లబ్ధిదారులంతా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులకు డిపాజిట్లు రావద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరు పరిధిలో ఏర్పాటుచేసిన మున్సిపల్ ఎన్నికల తొలి ప్రచార బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.

CM Revanth Reddy : బీఆర్ఎస్, బిజెపిలకు డిపాజిట్లు రావద్దు..!
సంక్షేమ పథకాల లబ్ధిదారులంతా కాంగ్రెసుకు ఓట్లు వేయాలి
పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం
రేషన్ కార్డులు ఇచ్చాము, సన్న బియ్యం ఇస్తున్నాం
మిర్యాలగూడ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
మిర్యాలగూడ, మన సాక్షి :
ప్రభుత్వం అందజేసే సంక్షేమ పథకాలు పొందిన లబ్ధిదారులంతా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులకు డిపాజిట్లు రావద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరు పరిధిలో ఏర్పాటుచేసిన మున్సిపల్ ఎన్నికల తొలి ప్రచార బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ఆయన కోరారు
ఏప్రిల్ లో నూతన బడ్జెట్లో మరోసారి లక్షలాది ఇందిరమ్మ ఇండ్లు పేదలకు ఇచ్చి పేదల ఆత్మగౌరవం పెంచే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. అంతకు ముందు 200 కోట్ల రూపాయల వ్యయంతో మిర్యాలగూడ నియోజకవర్గంలో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ
మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. మొదటి సమరం మిర్యాలగూడ నుండి ప్రారంభమైంది. గత రెండేళ్లలో పేదలు, గిరిజన , బడుగు, బలహీన వర్గాలు ,మహిళలు ,యువత కోసం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలపై ప్రజల ఆలోచన చేయాలన్నారు. గత ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు, 10 సంవత్సరాలు నిరీక్షించాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతిష్టాత్మకంగా రేషన్ కార్డులు ఇవ్వడమే కాకుండా మూడు కోట్ల 15 లక్షల మందికి సన్న బియ్యం ఇస్తున్నామన్నారు. అంతకుముందు ఇచ్చిన దొడ్డు బియ్యం మిల్లర్లకు అమ్ముకోనడమే కాకుండా దానాకు పనికి వచ్చేది. సన్న బియ్యంతో పాటు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం . దీంతో 50 లక్షల కుటుంబాలు వెలుగు చూస్తున్నాను.
గృహ జ్యోతి కింద ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. మిర్యాలగూడ రైస్ బోల్ ఆఫ్ తెలంగాణ గా మారింది. అత్యధికంగా వరి పండించే ప్రాంతం మిర్యాలగూడ. అధునాతన రైస్ మిల్లులు ఇక్కడ ఉన్నాయని రైతు రుణమాఫీ కింద 25 లక్షల 30 వేల మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు ఇచ్చామన్నారు రైతు భరోసా కింద ప్రతి ఎకరాకు 6000 చొప్పున ఒకేరోజు 9000 కోట్లు రైతుల ఖాతాలలో జమ చేసామని,
మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే మరోసారి రైతు భరోసా నిధులు రైతులకు ఖాతాలో వేస్తామన్నారు.

దేశంలోనే లక్ష 10,000 కోట్ల రూపాయలు రైతుల సంక్షేమం కోసం ఖర్చు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ, ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించామని, ప్రతి సంక్షేమ పథకం ఆడబిడ్డలకు అందిస్తున్నామని, పేద ప్రజల పిల్లలు చదువుకునేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను ఒకటి 200 కోట్లతో నిర్మిస్తున్నామన్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 20 వేల కోట్లతో 100 పాఠశాలలు నిర్మిస్తున్నామని, గతంలో ప్రభుత్వం ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ లు ఇచ్చిన పాపాన పోలేదు. తమ ప్రభుత్వం మొదటి విడతలొనే నియోజకవర్గానికి 22,500 కోట్ల తో నియోజకవర్గానికి 3500 చొప్పున నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలందరూ మరిన్ని ఇందిరమ్మ ఇండ్లు కావాలని అడుగుతున్నారు. ఏప్రిల్ లో నూతన బడ్జెట్ లో లక్షలాది ఇండ్లను పేదవారికి ఇచ్చి పేదల ఆత్మగౌరవం పెంచేందుకు బాధ్యత తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రం లోని అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం, 2 ఏళ్లలో ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తాం, 70 వేల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చాం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు, స్వయం సహాయక సంఘాల మహిళలను
1000 బస్సులకు యజమానులను చేశామన్నారు.
27 వేల కోట్ల రూపాయలను జీరో వడ్డీకి మహిళలకు రుణాలు ఇప్పించామని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో 17472 కోట్ల రూపాయలు ఖర్చు చేసామని, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మున్సిపాలిటీలలో 2028 కోట్లు ఖర్చు చేశామన్నారు. భవిష్యత్తులో వేలాది కోట్ల రూపాయలను తెచ్చి అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ,రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడారు.
సమావేశానికి అధ్యక్షత వహించిన మిర్యాలగూడ శాసనసభ్యులు మిర్యాలగూడ అభివృద్ధికి నూతన మంజురీలకు పలు ప్రతిపాదనలను ముఖ్యమంత్రి ముందు ఉంచారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి, శాసనసభ్యులు బాలు నాయక్ ,వేముల వీరేశం, పద్మావతి రెడ్డి, వంశీకృష్ణ, కుందూరు జైవీర్ రెడ్డి, వేముల వీరేశం, మందుల సామెల్, పర్యాటకశాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తదితరులు ఉన్నారు.
MOST READ
-
ACB : రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన అవినీతి తిమింగలం..!
-
Nalgonda : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్య.. నల్లగొండను మహా నగరంగా తీర్చిదిద్దుతా..!
-
CM Revanth Reddy : జాతిపితవా నువ్వు..?
-
Rythu Bharosa : రైతు భరోసా కు లైన్ క్లియర్.. సీఎం రేవంత్ రెడ్డి తాజా ప్రకటన..!









