తెలంగాణBreaking Newsవైద్యం

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. ఆసుపత్రుల పర్యవేక్షణకు త్వరలో యాప్..!

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. ఆసుపత్రుల పర్యవేక్షణకు త్వరలో యాప్..!

మన సాక్షి , హైదరాబాద్ :

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులు, వారిని పరీక్షించే వైద్యులు, ఆస్పత్రుల వేళలకు సంబంధించిన ఒక యాప్ రాబోతుంది. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించే విధంగా ఈ యాప్ ఉండనున్నది. ఈ యాప్ విషయంపై ఉన్నతాధికారులు అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి సూచించారు.

రాష్ట్రంలోని అన్ని మెడికల్ కళాశాలలో పూర్తిస్థాయి వసతుల కల్పనకు కార్యచరణ ప్రణాళికలు వెంటనే తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు ఆదేశించారు. సోమవారం వైద్యశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ప్రభుత్వ వైద్య కళాశాలలో నియామకాలు, బోధన సిబ్బందికి సంబంధించిన ప్రమోషన్లు, ఆస్పత్రులలో పడకల పెంపు, వైద్య పరికారాలపై నివేదిక రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన నిధులు, అనుమతులకు సంబంధించిన ఏమైనా ఉంటే వెంటనే పరిష్కరించాలని పేర్కొన్నారు.

ఆసుపత్రులకు వచ్చే రోగులు, వారిని పరీక్షించే వైద్యులు, ఆసుపత్రుల సమయాల పర్యవేక్షణకు ఒక యాప్ వినియోగించే అంశంపై అధ్యయనం చేయాలని అధికారులకు ఆయన సూచించారు. విద్య, వైద్యం కీలకమైనవని ప్రతినెల మూడో వారంలో ఈ రెండు శాఖలపై సమీక్ష నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని రేవంత్ రెడ్డి ఆదేశించారు.

MOST READ : 

మరిన్ని వార్తలు