తెలంగాణBreaking Newsవ్యవసాయం

TG News : రైతు భరోసా పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్..!

TG News : రైతు భరోసా పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదురుచూస్తున్న రైతు భరోసా పథకం పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు రైతు భరోసా పథకం అమలు చేస్తారా లేదా అని రైతులు సందిగ్ధంలో ఉన్నారు. మహబూబ్నగర్ వేదికగా నిర్వహించిన రైతు పండుగలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా పై స్పష్టత ఇస్తారని భావించినప్పటికీ ఇవ్వలేదు. దాంతో రైతుల్లో ఒకసారిగా నిరాశ కలిగింది.

కాగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. రైతు భరోసా పథకం పై ఇప్పటికే క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించిందని, అసెంబ్లీలో చర్చించి విధివిధానాలు ఖరారు చేస్తామని చెప్పారు. మారీచుల మాయమాటలను రైతులు నమ్మొద్దని కోరారు.

వరి పంటలకు సన్నధాన్యానికి 500 రూపాయల బోనస్ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఏడాది కాలంలోనే 20వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని, ఇది దేశ చరిత్రలోనే రికార్డు అని చెప్పారు. రైతు భరోసా పథకాన్ని కూడా అసెంబ్లీలో చర్చించి విధివిధానాల ఖరారు అయ్యాక సంక్రాంతి తర్వాత ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు.

2023 వానాకాలం సీజన్లో రైతు బంధు పంట సహాయాన్ని కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. రైతులను రాజులు చేయడమే తమ లక్ష్యమని, రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. రైతులకే కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. జవహర్ లాల్  నెహ్రూ నుంచి వైయస్సార్ దాకా రైతులే మా ఏజెండా అన్నారు.

కేసీఆర్ బకాయి పెట్టిన రైతు బంధు కూడా మేము అధికారంలోకి వచ్చాక చెల్లించినట్లు పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే రైతుబంధు నిధులు 7625 కోట్ల రూపాయలను చెల్లించినట్లు తెలిపారు. రైతు భరోసా పథకం కొనసాగుతుందని సంక్రాంతి తర్వాత రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలో వేయనున్నట్లు తెలిపారు.

MOST READ : 

మరిన్ని వార్తలు