కుప్పకూలిన వంతెన.. మేళ్లచెరువు – కోదాడ రాకపోకలు బంద్..!
కుప్పకూలిన వంతెన.. మేళ్లచెరువు – కోదాడ రాకపోకలు బంద్..!
మేళ్లచెరువు, మనసాక్షి:
సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం కందిబండ గ్రామ సమీపంలో ని వంతెన సోమవారం ఉదయం ఒక్కసారి గా కుప్పకూలింది. మేళ్లచెరువు, కోదాడ ప్రధాన రహదారిపై కందిబండ గ్రామ శివారులో గల ఈ వంతెన పురాతనమైనది.ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు పగుళ్లు వచ్చాయి.
ప్రమాదం పొంచి ఉండటంతో స్థానిక పోలీసులు నిన్నటి నుండే ఈ వంతెనపై భారీ వాహనాల రాకపోకలను నిలిపివేశారు. సోమవారం ఉదయం ఇది ఒక్కసారిగ కుప్పకూలింది.
పడిపోయే సమయంలో వంతెనపై ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం సంభవించలేదు.ఈ వంతెన కూలడంతో మేళ్లచెరువు, కోదాడ రాకపోకలు ఈ మార్గం ద్వారా నిలిచిపోయాయి.
LATEST UPDATE :
Runamafi : రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే ఖాతాలలోకి డబ్బులు..!
Railway : రాత పరీక్ష లేకుండానే రైల్వే జాబ్.. మళ్లీ ఇలాంటి ఛాన్స్ రాదు..!
BREAKING : విజయవాడ హైవే బ్లాక్.. మిర్యాలగూడ మీదుగా ట్రాఫిక్ మళ్లింపు..!









