TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనిర్మల జిల్లారాజకీయం

TG News : అమెరికా నుంచి వచ్చి.. ఒక్క ఓటుతో గెలిచి..!

TG News : అమెరికా నుంచి వచ్చి.. ఒక్క ఓటుతో గెలిచి..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

గ్రామపంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి. కొంతమంది ఒక్క ఓటుతో విజయం సాధించగా.. మరి కొంతమంది టాస్ వేసి కూడా గెలిచిన సంఘటనలు ఉన్నాయి. అలాంటిదే నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని బాగాపూర్ గ్రామపంచాయతీలో ఒక్క ఓటుతో గెలిచి విజయం సాధించారు.

బాగాపూర్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో ముత్యాల శ్రీ వేద ఒక్క ఓటు తేడాతో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో 426 ఓట్లకు గాను 378 కోట్లు పోలయ్యాయి. శ్రీ వేదకు 189 ఓట్లు రాగా.. ప్రత్యర్థి హర్ష స్వాతికి 188 ఓట్లు వచ్చాయి. ఒక్క ఓటు చెల్లలేదు.

ఇది ఇలా ఉండగా విజయం సాధించిన ముత్యాల శ్రీ వేద మామ ముత్యాల ఇంద్రకరణ్ రెడ్డి అమెరికాలో ఉంటున్నాడు. ఈ ఎన్నికల్లో ఆమెకు ఓటు వేసేందుకు అమెరికా నుండి నాలుగు రోజుల ముందే స్వ గ్రామానికి వచ్చాడు. కాగా శ్రీ వేద ఒక్క ఓటుతో విజయం సాధించడం వల్ల మామ ఓటు వల్ల విజయం సాధించినట్లుగా ఓటర్లు భావిస్తున్నారు.

MOST READ 

  1. TG News : రెండో విడత పంచాయతీ పోరులో కాంగ్రెస్ పై చేయి.. బీ ఆర్ ఎస్ పోటాపోటీ ఫలితాలు..!

  2. AP News : త్రో బాల్ పోటీలలో డివిజన్ స్థాయి విజేతగా రామసముద్రం ఉపాధ్యాయులు..!

  3. Local Body Elections : అమ్మా నన్ను ఓటు వేసి దీవించు.. కాళ్లు మొక్కి ఓటు అడుగుతున్న సర్పంచ్ అభ్యర్థి..!

  4. BREAKING : ఘోర ప్రమాదం.. బస్సు లోయలో పడి 15 మంది మృతి..!

మరిన్ని వార్తలు