Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్క్రీడలు

AP News : త్రో బాల్ పోటీలలో డివిజన్ స్థాయి విజేతగా రామసముద్రం ఉపాధ్యాయులు..!

AP News : త్రో బాల్ పోటీలలో డివిజన్ స్థాయి విజేతగా రామసముద్రం ఉపాధ్యాయులు..!

రామసముద్రం, మనసాక్షి :

అన్నమయ్య జిల్లా మదనపల్లి సమీపంలోని శ్రీ వేద పాఠశాలలో డివిజన్ స్థాయిలో జరిగిన త్రోబాల్ పోటీలలో మండలానికి చెందిన మహిళా ఉపాధ్యాయులు ఫైనల్ లో గెలిచి విజేతగా గెలిచారు.

మదనపల్లి డివిజన్ పరిధిలోని 15 మండలాలు ఈ పోటీలలో పాల్గొని ఆడారు. ప్రతి మండలం తోనూ ఆడి మండలానికి మహిళా ఉపాధ్యాయులు విజేతగా నిలిచారు. చివర్లో గుర్రంకొండ, రామసముద్రం మండలాలు ఫైనల్ కు చేరుకోగా చివరకు రసవత్తరంగా సాగిన పోటీలో అత్యంత ప్రతిభ కనబరిచి మండల ఉపాధ్యాయులు విజేతగా నిలిచారు.

ఈ సందర్భంగా గెలిచిన టీంకు డివిజన్ స్థాయి అధికారులు మేమంటోళ్లను, ట్రోఫీని అందజేశారు.
రామసముద్రం ఎస్టియు ప్రధాన కార్యదర్శి రమాదేవి ఉన్నత పాఠశాల పిడి రమాదేవి అందరిని ఉత్తేజపరిచి టీం గెలవడానికి కృషి చేశారు. ఈ సందర్భంగా రామ సముద్రం మండల విద్యాశాఖ అధికారి హేమలత, ఆంజనేయులు ఎస్టియు అధ్యక్షులు ఆయూబ్ ఖాన్ ఆర్థిక కార్యదర్శి సురేష్, రామసముద్రం,

చెంబకూరు ,చొక్కాండ్ల పల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిట్టిబాబు, రమేష్ బాబు, శ్రీనివాసులు, మండల రిటైర్డ్ ఎంఈఓ రెడ్డప్ప మట్లవారిపల్లి ఉన్నత పాఠశాల పిడి పార్థసారథి,ఏ పి మోడల్ పి డి ఇందిర గెలిచిన మహిళా ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలిపారు.

MOST READ 

Nalgonda : అధికారులు, పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఓ వైపు, బిఆరెస్ కార్యకర్తలు మరో వైపు..!

TG News : మురుగుకాలవలో బ్యాలెట్ పత్రాలు.. జిల్లా కలెక్టర్ చర్యలు..!

Power Cut : రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం..! 

Suryapet : నేడు పంచాయతీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్..!

మరిన్ని వార్తలు