Suryapet : నేడు పంచాయతీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్..!

Suryapet : నేడు పంచాయతీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్..!
తుంగతుర్తి, మన సాక్షి:
తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని పలు మండలాలలో నూతనకల్లు, మద్దిరాల, తుంగతుర్తి, నాగారం, జాజిరెడ్డిగూడెం మండలాలకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్.కేంద్రాలను సందర్శించారు. డి ఆర్ సి కేంద్రాలలో కలెక్టర్ మాట్లాడుతూ పి ఓలు, ఏపీవోలు పోలింగ్ సామాగ్రిని, బ్యాలెట్ బాక్స్ లను జాగ్రత్తగా పరిశీలించి తీసుకోవాలని , అన్ని సరిగ్గా ఉన్నాయో మరోసారి పరిశీలించుకోవాలని చెప్పారు.
రిజర్వు సిబ్బందికి ఏదో ఒక గ్రామ పంచాయతీలో విధులు కేటాయించడం జరుగుతుందని, సిబ్బంది అందరూ వారికి కేటాయించిన గ్రామపంచాయతీ పోలింగ్ స్టేషన్లకు జోనల్ ఆఫీసర్ తో వెళ్లి పోలింగ్ స్టేషన్ కు చేరుకొని అక్కడ రాత్రి బస చేయాలని, సాయంత్రం సంబంధిత పోలింగ్ కేంద్రానికి చేరుకోగానే ఆ పోలింగ్ స్టేషన్ ను క్షుణ్ణంగా పరిశీలించి పోలింగ్ కు అనుకూలంగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు.
గురువారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్ నిర్వహించాలని, మధ్యాహ్నం 1 తర్వాత ఓటర్లు ఓట్లు వేసేందుకు క్యూ లైన్లో ఉన్నట్లయితే పై అధికారుల అనుమతితో పోలింగ్ నిర్వహించాలని చెప్పారు.పోలింగ్ కేంద్రాల పరిధిలో శాంతి, భద్రతలకు విఘాతం కలగకుండా చూసుకోవాలని, ఏవైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు మండల టీంకు సమాచారం అందిస్తే అవసరమైతే అదనపు పోలీస్ సిబ్బందిని పంపించడం జరుగుతుందని తెలిపారు.
పోలింగ్ తదుపరి మధ్యాహ్నం 2 గంటల నుండి ఓట్ల లెక్కింపు చేపట్టాలని, ఓట్ల లెక్కింపులో రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ప్రజాస్వామ్య పద్ధతిలో లెక్కింపు జరపాలని అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ఓట్ల లెక్కింపు పూర్తయిన పిదప స్టేజ్-II రిటర్నింగ్ ఆఫీసర్లు ఫలితాలు వెల్లడించే ముందు జిల్లా ఎన్నికల అధికారి, జనరల్ అబ్జర్వర్ అనుమతి తీసుకొని తుది ఫలితాలు ప్రకటించాలని తెలిపారు.
జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేక ఎలక్షన్ సెల్ విభాగం ఏర్పాటు చేయడం జరిగిందని, ఎలక్షన్ సెల్ కు ఫోన్ కాల్ ద్వారా , వాట్సాప్ మెసేజ్ ద్వారా అనుమతి తీసుకొని ఫలితాలు ప్రకటించాలని ,ప్రతి ఎన్నికల సిబ్బంది బాధ్యతగా ఎన్నికల విధులు నిర్వహించి విజయవంతం చేయాలని కలెక్టర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో సూర్యాపేట ఆర్డిఓ వేణుమాధవ్, మండల స్పెషల్ ఆఫీసర్లు శ్రీధర్ రెడ్డి, శ్రీనివాస్ నాయక్, అశోక్, నాగయ్య, నాగులు నాయక్, ఎంపీడీవోలు ఎండి హస్సిన్, సునీత, సత్యనారాయణ రెడ్డి, శేష్ కుమార్, భీమ్ సింగ్, పి. ఝాన్సీ తాసిల్దార్లు అమన్ సింగ్, శ్రీనివాస్, దయానందం, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
District collector : ఓటు వేసేందుకు వెళ్తున్నారా.. అయితే ఈ 18 రకాల గుర్తింపు కార్డులో ఏదైనా చూపవచ్చు..!
-
ACB : రూ.15 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఇంచార్జ్ ఏఈ..!
-
TG News : గ్లోబల్ సమ్మిట్ వేదికగా.. కలెక్టరేట్ లలో తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ..!
-
EV : సరికొత్త ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ కారు.. గ్లోబల్ సమ్మిట్ లో ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి..!
-
Gold Price : తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు ధరలు ఇవీ..!










