Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

District collector : ఓటు వేసేందుకు వెళ్తున్నారా.. అయితే ఈ 18 రకాల గుర్తింపు కార్డులో ఏదైనా చూపవచ్చు..!

District collector : ఓటు వేసేందుకు వెళ్తున్నారా.. అయితే ఈ 18 రకాల గుర్తింపు కార్డులో ఏదైనా చూపవచ్చు..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

ఈ నెల 11, 14, 17 తేదీలలో మూడు విడతల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వెళ్ళేటపుడు 18 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా ఒక దానిని తమ వెంట తీసుకెళ్లాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ బుదవారం ఒక ప్రకటనలో తెలిపారు.

1) ఓటర్ కార్డు
2) ఆధార్ కార్డు
3) జాతీయ గ్రామీణ ఉపాధి హామీ జాబ్ కార్డు
4) ఫోటోతో కూడిన పోస్ట్ ఆఫీస్/ బ్యాంక్ పాస్ బుక్
5) కార్మిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు
6) డ్రైవింగ్ లైసెన్స్
7) పాన్ కార్డ్
8) ఫోటోతో కూడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ కుల ధృవీకరణ పత్రాలు
9) ఇండియన్ పాస్పోర్ట్
10) ఫోటోతో కూడిన పెన్షన్ డాక్యుమెంట్
11) కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలచే జారీ చేయబడిన ఉద్యోగ గుర్తింపు కార్డు
12) ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఇచ్చిన అధికారిక గుర్తింపు కార్డు
13) దివ్యాంగుల గుర్తింపు కార్డు
14) పట్టాదార్ పాస్ పుస్తకం
15) రేషన్ కార్డు
16) ఫోటోతో కూడిన ఆయుధ లైసెన్స్ పత్రం
17) ఫ్రీడం ఫైటర్ ఐ.డీ కార్డ్
18) ఆర్జీఐ ద్వారా జారీ చేయబడిన ఎన్.పీ.ఆర్ స్మార్ట్ కార్డు

పై వాటిలో ఏదైనా ఒక దానిని చూపించి ఓటు వేయవచ్చని కలెక్టర్ సూచించారు. ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటాలని కలెక్టర్ ప్రకటనలో కోరారు.

By : Ramakanth

90520 41606

MOST READ : 

  1. Nalgonda : జిల్లా ఎస్పీ కీలక సూచన.. పోలింగ్ బూత్ లోకి ఇవి తీసుకెళ్లొద్దు..!

  2. Sarpanch Elections : సర్పంచ్ బరిలో అప్పుడు భర్తలు.. ఇప్పుడు భార్యలు..!

  3. EV : సరికొత్త ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ కారు.. గ్లోబల్ సమ్మిట్ లో ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి..!

  4. SBI : ఎస్బిఐలో పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారానే ఉద్యోగాలు.. గడువు లేదు త్వరపడండి..!

  5. Theft : పూజారి ఇంట్లో భారీగా 40 తులాల బంగారం, నగదు చోరీ..!

మరిన్ని వార్తలు