Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

Miryalaguda : కాల్వపల్లి లో కాంగ్రెస్ ఇంటింటా ప్రచారం..!

Miryalaguda : కాల్వపల్లి లో కాంగ్రెస్ ఇంటింటా ప్రచారం..!

మిర్యాలగూడ, మన సాక్షి :

మిర్యాలగూడ మండలం కాల్వపల్లి గ్రామంలో మిత్ర పక్షాలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిని జంగిలి శివలీలని గెలిపించాలని కోరుతూ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గాయం ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలో నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని తెలిపారు.

శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, శాసనమండలి సభ్యులు కేతావత్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో నియోజకవర్గం అభివృద్ధి పథంలో పరిగెడుదని తెలిపారు. పేద ప్రజలకు ఉచితంగా సన్నబియ్యం అందించిన ఘనత దేశంలో తెలంగాణ రాష్ట్రానికి దక్కుతుందని నియోజకవర్గంలో అత్యధికంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించారని, ప్రతి ఒక్కలందరుడికి 5 లక్షల రూపాయలతో ప్రభుత్వ ఇల్లు నిర్మిస్తుందని, గ్రామాలలో ప్రతి ఒక్కరికి ఫ్రీ కరెంటు ద్వారా ఎంతోమందికి మేలు జరుగుతుందని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కాంగ్రెస్ జంగలీ శివలలీల కత్తెర గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి, మిర్యాలగూడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తలకొప్పుల సైదులు, మునిసిపల్ వార్డు కౌన్సిలర్ దేశిడి శేఖర్ రెడ్డి, జంగిలి లింగయ్య, దామ సైదులు, వీరేపల్లి రామకృష్ణారావు,

జంగిలి లింగయ్య యాదవ్, బత్తుల ఆంజనేయులు, మండల వెంకటయ్య నుకపంగా మోహన్ తలకోప్పుల కిరణ్ , నూకపంగా జానయ్య, నేరెళ్ల సంజయ్ కుమార్, జంగిలీ గోపి, పదర వినోద్, బత్తుల శివ తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

MOST READ 

  1. TG News : గ్లోబల్ సమ్మిట్ వేదికగా.. కలెక్టరేట్ లలో తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ..!

  2. TG News : తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు.. రెండో విడుతలో ఏకగ్రీవాల జోరు, అన్ని వందలా..!

  3. TG News : తెలంగాణ రైజింగ్, గ్లోబల్ సమ్మిట్ రేపటి నుంచే.. ఏంచేస్తారో తెలుసా..!

  4. ACB : ఏసీబీకి చిక్కిన చండూరు డిప్యూటీ తాసిల్దార్..!

మరిన్ని వార్తలు