TG News : యూరియా, ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే ఫిర్యాదుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు..!

TG News : యూరియా, ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే ఫిర్యాదుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు..!
హైదరాబాద్, మన సాక్షి :
రాష్ట్రంలో అక్రమ యూరియా నిలువలు ఉంటే చట్టపరమైన చర్యలు తప్పవని డీలర్లను వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ బి గోపి హెచ్చరించారు. జిల్లా స్థాయిలో యూరియా, ఇతర ఎరువుల నిల్వలు ఎప్పటికప్పుడు అధికారులు తనిఖీ చేసుకోవాలన్నారు.
ఎవరైనా డీలర్లు, వ్యాపారస్తులు ఎక్కువ మొత్తంలో నిల్వలు చేసి బ్లాక్ మార్కెట్లో అమ్మే ప్రయత్నం చేస్తే.. వారిపై కేసులు నమోదు చేయాలని అధికారులకు సూచించారు. ఇక యూరియా పంపిణి సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
రైతులకు అవసరాలకు మేరకే యూరియా పంపిణి చేయాలనీ ఆదేశించారు. ఇక నిర్ధారించిన ధరకంటే ఎక్కవ ధరకు యూరియా అమ్మకాలు చేసిన కఠిన చర్యలు తప్పవన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కేంద్రం రాష్ట్రానికి పంపించే కొద్దీ రైతులకు ఎరువులను అందుబాటులో వుంచుతున్నామని తెలిపారు.
కొన్ని జిల్లాలో రైతులు ఎరువుల కోసం గంటల తరబడి లైన్ లో నిలుచుంటున్నారని, రైతులకు వరుస క్రమంలో యూరియా పంపిణి జరుగుతుందని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
వ్యవసాయశాఖ డైరెక్టర్ బి గోపి. యూరియా ఎరువుల అక్రమ నిల్వలు, అధిక ధరలకు అమ్మితే ఫిర్యాదు చేయడానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడమైనది. ఎవరైనా ఈ నెంబర్ కు 89777-41771 ఫిర్యాదు చేయవచ్చు. ఈ నెంబర్ ఉదయం 10.30 నుండి సాయంత్రం 5.00 వరకు అందుబాటులో ఉంటుంది.
ఈరోజు కేంద్ర వ్యవసాయశాఖ సెక్రెటరీ ఫెర్టిలైజర్స్ రజత్ కుమార్ మిశ్రా, అగ్రికల్చర్ ఫార్మర్ సంక్షేమ శాఖ సెక్రెటరీ దేవేష్ చతుర్వేది, అన్ని రాష్ట్రాల వ్యవసాయ శాఖ ఉన్నత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రాలలో కేంద్ర తనిఖీల బృందాలు కూడా తనిఖీలు చేపట్టే అవకాశం ఉందన్నారు.
MOST READ :
-
TG News : తెలంగాణలో నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. నెలకు రూ.1000.. దరఖాస్తు ఇలా..!
-
Obesity: అన్నం తింటే బరువు పెరుగుతారా.. నిజమిదే తెలుసుకుందాం..!
-
Neck: మెడ నల్లగా మారిందా.. ఇలా చేయండి ఈజీగా పోద్ది..!
-
Diabetes : పరీక్షలు లేకుండానే మీ శరీరంలో షుగర్ తెలుసుకోవచ్చు..!
-
Street Foods: స్ట్రీట్ ఫుడ్స్ తింటున్నారా.. కేంద్రం హెచ్చరిక..!









