Cotton : పత్తి రైతు చిత్తు.. భారీ వర్షాలతో తగ్గిన దిగుబడి..!

Cotton : పత్తి రైతు చిత్తు.. భారీ వర్షాలతో తగ్గిన దిగుబడి..!
చింతపల్లి, మనసాక్షి :
రైతులు అప్పులు చేసి ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి పంట ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా గత నెల రోజుల నుండి నిరంతరాయంగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రత్తి చేలు పూర్తిగా ఎర్రబారి చేతికొచ్చిన పంట వర్షానికి తడవడంతో నల్లబారి రైతులు తీవ్రంగా, నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఆరుకాలం చేసిన కష్టం చేతికందుతుందో లేదో అని రైతులు ఆవేదన వ్యక్తులు వస్తున్నారు.
చేనుపై ఉన్న పత్తి వర్షాలకు నల్లబారడమే కాకుండా నాణ్యత కూడా తగ్గిపోయింది. పంట చేనుపై ఉన్నదన్నా ఎరుకోవాలంటే కూలీల దొరకక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏరింది అమ్ముకుందామంటే మార్కెట్లో మద్దతు ధరలేదు. ఓపెన్ మార్కెట్లో దళారీలదే రాజ్యం నాణ్యత పేరుతో వారు నిర్ణయించిందే ధర 4000వేల నుండి 5000వేల వరకు తక్కువదరకే కొనుగోలు చేస్తున్నారు.
కాబట్టి ప్రభుత్వం తక్షణమే నష్టపోయిన ప్రత్తి పంటలను క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిశీలించి పంట నష్టం అంచనాలు వేయించి జరిగిన నష్టానికి ఎకరానికి 10000వేల రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రకటించిరైతులను ఆదుకోవాలని రైతన్నలు కోరుతున్నారు.
అదేవిధంగా తక్షణమే సీసీ ఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి తడిసిన ప్రత్తిని నాణ్యతా ప్రమాణాల ఆంక్షలు లేకుండా క్వింటాలుకు10000 వేలు కనీస ధర తగ్గకుండా కొనుగోలు చేసి నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని అధికారులను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
మండలంలోని వ్యవసాయ శాఖ అధికారులచే పంట నష్టపోయిన రైతులను క్షేత్రస్థాయిలో గుర్తించి పంట నష్ట వివరాలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని రైతులు వేడుకుంటున్నారు.
MOST READ :
-
Suryapet : ఆయిల్ పామ్ సాగు పై క్షేత్ర సందర్శన కు వెళ్లిన రైతులు..!
-
Suryapet : సిఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. ఆ ప్రాజెక్టు దామోదర్ రెడ్డి పేరు..!
-
Khammam : తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం.. స్థలాలు పరిశీలించిన జిల్లా కలెక్టర్..!
-
TG News : తెలంగాణ రాజకీయాల్లో మరో విషాదం.. మాజీ ఎమ్మెల్యే కన్నుమూత..!









