TOP STORIESBreaking Newsజాతీయం

Covid Vaccine Report : కోవిడ్ వ్యాక్సిన్.. గుండెపోటు మరణాలు.. కమిటీ ఏం తేల్చింది..!

Covid Vaccine Report : కోవిడ్ వ్యాక్సిన్.. గుండెపోటు మరణాలు.. కమిటీ ఏం తేల్చింది..!

మన సాక్షి , వెబ్ డెస్క్:

ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు ఎక్కువయ్యాయి. అయితే ఎక్కువగా కోవిడ్ వ్యాక్సిన్ వల్లనే గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయని చర్చ కొనసాగుతుంది. అయితే కోవిడ్ వ్యాక్సిన్ కు.. గుండెపోటు మరణాలకు ఏదైనా సంబంధం ఉందా..? అనే విషయాన్ని తేల్చడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. తాజాగా నిపుణుల కమిటీ అధ్యయనం మేరకు అధ్యాయంలో తేల్చిన విషయాలను వెల్లడించింది

నెల రోజుల్లో 20 మందికి పైగా యువకులు గుండెపోటుతో మరణించడానికి కోవిడ్ వ్యాక్సిన్ కావచ్చునని అనుమానాలను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇటీవల వ్యక్తం చేశారు. దాంతో కోవిడ్ వ్యాక్సిన్ కు గుండెపోటు మరణాలకు ఏమైనా సంబంధం ఉందా..? అనే విషయాన్ని తేల్చడానికి నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేశారు. నిపుణుల కమిటీ అధ్యయనము చేసిన విషయాలను వెల్లడించింది.

ఆకస్మిక మరణాలకు కోవిడ్ టీకాలకు ఎలాంటి సంబంధం లేదని నిపుణుల కమిటీ అధ్యయనంలో స్పష్టం చేసింది. అయితే ఆకస్మికంగా గుండెపోటు మరణాలకు లాంగ్ కోవిడ్ కారణం కావచ్చునని తెలిపింది. కోవిడ్ ముగిసిన సుదీర్ఘకాలం తర్వాత ఆకస్మిక గుండెపోటు మరణాలు పెరిగాయి. కోవిడ్ మహమ్మారి ముగిసి కూడా మూడేళ్లు అవుతుంది అని నివేదికలో పేర్కొన్నది.

ఈ అంశంపై ప్రపంచవ్యాప్తంగా పలు రీసెర్చ్ పేపర్లను అధ్యయనం చేసినట్లు కమిటీ పేర్కొన్నది. కోవిడ్ వ్యాక్సిన్ కు గుండెపోటు మరణాలకు సంబంధం లేదని తేల్చింది. వాస్తవానికి దీర్ఘకాలంలో గుండెపోటు మరణాలు సంభవించకుండా కోవిడ్ వ్యాక్సిన్ నుంచి రక్షణ లభిస్తున్నట్లు పరిశీలనలో తేలిందని నిపుణుల కమిటీ పేర్కొన్నది.

2025 ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఈ అధ్యాయం కొనసాగింది. ఈ అధ్యయనం కోసం నిపుణుల కమిటీ 45 సంవత్సరాల లోపు ఉన్న 251 మంది పేషెంట్లను అబ్జర్వ్ చేసింది.

ఈ వార్తలు కూడా క్లిక్ చేసి చదవండి : 

  1. TG News : ఉద్యోగుల పని వేళల పరిమితిలో మార్పు..!

  2. KCR : ఐదుగురు సంతానం.. కొడుకు పేరు కేసీఆర్ గా నామకరణం చేసిన అభిమాని..!

  3. Nalgonda : మత్స్య కార్మికులకు తీవ్ర హెచ్చరిక.. రెండు నెలల పాటు నిషేధం..!

  4. Rythu : రైతుల ఖాతాలలో రూ.7 వేలు జమ.. లేటెస్ట్ అప్డేట్..!

  5. Nagarjuna Sagar : నాగార్జునసాగర్ కు చేరుతున్న వరద నీరు.. ఈసారి కూడా ముందస్తేనా..!

మరిన్ని వార్తలు