Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంహైదరాబాద్

KCR : కెసిఆర్ బహిరంగ సభ.. రేవంత్ సర్కార్ షాకింగ్..

KCR : కెసిఆర్ బహిరంగ సభ.. రేవంత్ సర్కార్ షాకింగ్..

మన సాక్షి ,వెబ్ డెస్క్:

బి ఆర్ ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. నల్గొండ జిల్లాలో ఈనెల 13వ తేదీన భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ సభ ద్వారా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలిసింది. సుమారుగా రెండు లక్షల మందితో బహిరంగ సభ నిర్వహించాలని ప్లాన్ చేసినట్లు సమాచారం.

ALSO READ : KCR : మా నీళ్లు మాకే.. 13న నల్గొండలో కేసీఆర్ భారీ బహిరంగ సభ..!

కృష్ణా జలాలను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించడం పై పోరాటం కొనసాగించడానికి నల్లగొండ జిల్లా వేదికగానే ప్రారంభించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా నల్గొండ జిల్లాకు సంబంధించి రేవంత్ రెడ్డి సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో నెల రోజులపాటు 30, 30A పోలీస్ యాక్ట్ 1861 అమల్లోకి తీసుకువచ్చింది. ఈ మేరకు నల్గొండ జిల్లా ఎస్పీ చందన దీప్తి ఒక ప్రకటన కూడా విడుదల చేశారు.

ALSO READ : BREAKING : బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ లో చేరిక..!

ఈ చట్టం ప్రకారం పోలీసు అధికారుల ముందస్తు అనుమతి తీసుకోకుండా జిల్లాలో ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, సభలు ఎలాంటివి నిర్వహించొద్దని ఎస్పీ సూచించారు. కేసీఆర్ బహిరంగ సభకు ప్లాన్ చేయడంతో రేవంత్ రెడ్డి సర్కార్ ఈ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చిందని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఏది ఏమైనా సభ నిర్వహించి తీరుతామని హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వార్తలు