KCR : మా నీళ్లు మాకే.. 13న నల్గొండలో కేసీఆర్ భారీ బహిరంగ సభ..!

మా నీళ్లు మాకే అనే నినాదంతో టిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని సాధించే వరకు వదలకుండా పోరాడాడు. ఆ తర్వాత 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న ఆయన ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. కాగా తిరిగి అధికారం కోల్పోవడంతో మరోసారి ప్రజల్లోకి వెళ్లి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి సిద్ధమయ్యారు.

KCR : మా నీళ్లు మాకే.. 13న నల్గొండలో కేసీఆర్ భారీ బహిరంగ సభ..!

హైదరాబాద్ ,మన సాక్షి :

మా నీళ్లు మాకే అనే నినాదంతో టిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని సాధించే వరకు వదలకుండా పోరాడాడు. ఆ తర్వాత 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న ఆయన ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. కాగా తిరిగి అధికారం కోల్పోవడంతో మరోసారి ప్రజల్లోకి వెళ్లి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి సిద్ధమయ్యారు.

అందుకు మళ్లీ కృష్ణ జలాలతోనే ఉద్యమం ప్రారంభించేందుకు నిర్ణయించారు. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పగించడాన్ని నిరసిస్తూ ఉద్యమం చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రజల్లోకి వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించారు. అందుకుగాను ఈనెల 13వ తేదీన నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.

మంగళవారం హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో ముఖ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు మంగళహారతులతో మహిళలు స్వాగతం పలికారు.

ALSO READ : ఉచిత విద్యు త్ కావాలంటే ఆధార్ తో పాటు ఇవి ఉంచుకోండి.. నేటి నుంచి ఇంటి వద్దకే విద్యుత్ అధికారులు..!

అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో సాగునీటి హక్కులకై ప్రజా ఉద్యమాలు నిర్వహించిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అన్నారు.కె ఆర్ ఎం బి పేరుతో కృష్ణ నది ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించడమే అన్నారు. కృష్ణానది ప్రాజెక్టులపై తెలంగాణ కున్న హక్కులను కైవసం చేసుకునేందుకే కేంద్రం ఎత్తుగడని వేసింది అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవగాహన రాయిత్యంతో సంతకాలు చేసి తీసుకున్న నిర్ణయం వల్ల భవిష్యత్తులో ప్రాజెక్టుల కట్టల మీదికి కూడా పోలేని పరిస్థితి దాపురించనున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.

దీన్ని ప్రజా మద్దతుతో తిప్పికొడతామన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాల ప్రజలు సాగు, తాగునీరు అందక కరువుకూరల్లో చిక్కుకునే ప్రమాదం పొంచి ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ మూర్ఖపు వైఖరిని తిప్పి కొట్టి కృష్ణా జలాలపై ప్రాజెక్టులపై తెలంగాణకు రావలసిన వాటాను నూరు శాతం కాపాడుకునేందుకు ఎంతకైనా పోరాడాల్సిందేనని కేసీఆర్ పేర్కొన్నారు.

ALSO READ : మిర్యాలగూడ : 50 రోజుల్లో రూ.14 వేల కోట్ల అప్పు.. రేవంత్ పై మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ,నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి , తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్, కడియం శ్రీహరి తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తదితరులు పాల్గొన్నారు.